ఎక్కడ దాడి జరిగిన.. సిటీతోనే లింక్, రాములమ్మ అసహనం
దేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన హైదరాబాద్‌తో లింక్ ఉంటుంది. బీహర్ దర్బంగా రైల్వేస్టేషన్ బాంబు ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అయితే హైదరాబాద్‌లో ములాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను అరెస్ట్ కూడా చేసింది. హైదరాబాదుతో లింక్ ఉండటం కలవరపెడుతోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి బట్టబయలయ్యాయని, ఇవన్నీ తెలంగాణ సర్కారును అప్రతిష్టపాలు చేసే పరిణామాలని అన్నారు.
హైదరాబాదును విశ్వనగరం చేస్తామని ఏడేళ్ళుగా చెబుతున్న సీఎం కేసీఆర్ అసమర్థత నగర ప్రజల సామాజిక భద్రతను గాలికొదిలేసిందని, అన్ని విధాలుగా భ్రష్టుపట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తప్ప చేసిందేమీ లేదని తీవ్రంగా మండిపడ్డారు. పోలీస్ శాఖ, నిఘా విభాగాలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పడానికే తప్ప ఉగ్రవాదులు, అసాంఘిక శక్తుల నిర్మూలనకు వినియోగించిన దాఖలాలే లేవని ఆరోపించారు. నగరాన్ని కల్లోలపరుస్తున్న ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్‌ని ఎన్ఐఏ గుర్తించే వరకూ వాటి గురించి తెలియని అజ్ఞానంలో ప్రభుత్వం ఉందంటే నమ్మేంత అమాయకులెవరూ లేరని ఎద్దేవా చేశారు. మైనార్టీల ఓట్ల కోసం తమ సయామీ ట్విన్ ఎంఐఎం లాంటి మతవాద పార్టీని సంతృప్తిపరచడం మాత్రమే అధికార టీఆరెస్ సర్కారుకు చేతనైన ఒకే ఒక పనిగా కనిపిస్తోందని విజయశాంతి మండిపడ్డారు.

బీహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్‌లో బాంబు దాడి జరిగిన సంగతి విదితమే. ఈ ఘటనకు హైదరాబాద్‌కు లింకు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించి కేసు నమోదు చేసింది. నిందితులను అరెస్టు చేసి విచారించగా... ఐఎస్‌ఐ ఉగ్రదాడికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తేలింది. జూన్ 17 జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఎ తీగలాగితే...డొంక కదిలిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications