ఇప్పుడు బల్దియాపై.. ఏర్పాట్ల గురించి రాములమ్మ ఫైర్
చినుకు పడితే చాలు గ్రేటర్ హైదరాబాద్ చిత్తడి అవుతుంది. ఈ సారి ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి. అయితే బల్దియా సరయిన ఏర్పాట్లు చేయలేదు. దీనిని ప్రతిపక్షాలు తప్పపడుతున్నాయి. బీజేపీ నేత, ఫైర్ బ్రాండ్ విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సిటీలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విజయశాంతి సోషల్ మీడియాలో వివరించారు. హైదరాబాద్ లో వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. సోమవారం కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే కాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఇండ్లు, షాపుల్లోకి వరద చేరింది. కొన్ని చోట్ల సరుకులు కొట్టుకుపోయాయి.

జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోకి వరద నీళ్లు వచ్చాయి. హైదరాబాద్ కలెక్టరేట్‌లో గల ఓ ఫ్లోర్‌లో నీళ్లు చేరాయి. బేగంపేట్, మాసబ్ ట్యాంక్, బంజారాహి ల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, కోరి, లక్ష్మీకాపూల్, మెహిదీపట్నం, నాంపల్లి. మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని విజయశాంతి అన్నారు.
భారీ వర్షాల వల్ల జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదులు వచ్చాయి. వరద సమస్యలు, చెట్ల కొమ్మలు, విద్యుత్, డ్రైనేజీలు వాటి గురించి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications