పెళ్లి తర్వాత ప్రేమోన్మాదం.. అక్రమసంబంధం ఎంతకు దారితీసిందంటే..

ఆమె.. వేరొకరి భార్య. అతనికీ పెళ్లై పిల్లలున్నారు. అయినాసరే ఇద్దరూ దగ్గరయ్యారు. ఎవరికంటా పడకుండా గుట్టుగా కలుసుకునేవాళ్లు. ఈమధ్యే ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిసింది. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆమె.. అతణ్ని దూరంపెట్టే ప్రయత్నం చేసింది. చివరికి ప్రేమోన్మాదిలా మారిన అతను.. ఆమెను తగులబెట్టి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఈ కేసు వివరాల్లోకి వెళితే..

జిల్లాలోని అగ్గనూరు

జిల్లాలోని అగ్గనూరు

జిల్లాలోని అగ్గనూరుకు చెందిన నర్సింహులు(41), అంజలమ్మ(40)కు వేర్వేరుగా పెండ్లిల్లయ్యాయి. కొంతకాలం కిందట వీరిమధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం తెలియడంతో అంజలమ్మ తల్లిదండ్రులు ఆమెపై కోపడ్డారు. నర్సింహులుతో సంబంధం తెంచుకోకుంటే, రెండు కుటుంబాలూ ఆగమైపోతాయని హెచ్చరించారు. ఆమె తనను దూరం పెట్టడాన్ని సహించలేకపోయిన నర్సింహులు ఉన్మాదిలా మారిపోయాడు.

ఇంటికెళ్లిమరీ..

ఇంటికెళ్లిమరీ..

శుక్రవారం తెల్లవారుజామున అంజలమ్మ ఇంటికొచ్చిన నర్సింహులు.. ఆమెతో, ఆమె తల్లిదండ్రులతో గొడవపెట్టుకున్నాడు. అదనుచూసి.. వెంటతెచ్చుకున్న కిరోసిన్ ను ఆమెపై చల్లి నిప్పింటించాడు. ఆ వెంటనే తానూ కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కూతుర్ని కాపాడుకునే ప్రయత్నంలో అంజలమ్మ తల్లిదండ్రుకూ మంటలంటుకున్నాయి.

చావుబతుకుల్లో..

చావుబతుకుల్లో..

90 శాతం కాలినగాయాలతో నర్సింహులు, 80 శాతం గాయాలతో అంజలమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వికారాబాద్ పోలీసులు చెప్పారు. ఘాతుకానికి తెగబడ్డ నర్సింహులుపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు. అంజలమ్మను కాపాడే ప్రయత్నంలో ఆమె తల్లిదండ్రులకు 40 శాతం గాయాలయ్యాయని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+