• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇక విక్ర‌మార్కుడు ప్ర‌తిప‌క్ష నాయకుడు..! ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నిస్తామంటున్న కాంగ్రెస్..!!

|

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న స‌భ తొలి ప్ర‌హ‌స‌నం ముగింపు ద‌శ‌కు చేరుకుంది. గ‌వ‌ర్న‌ర్ స్పీచ్ కి ధ‌న్య‌వాదాలు తెలిపితే ఇక తొలి ప్ర‌మాణ స్వీకార ఘ‌ట్టం, శాస‌న స‌భ స్పీక‌ర్ ఎంపిక‌, ప్ర‌తిప‌క్ష నేత ఎన్నిక అన్ని కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా ముగిసాయి. ఇక కార్య‌క్ర‌మాలు ఎన్నిరోజులు నిర్వ‌హించాలి అనే దానిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సంఖ్య త‌క్కువున్న‌ప్ప‌టికి ప్ర‌తిపక్ష నేత‌ను స‌రైన అభ్య‌ర్థిని ఎన్నుకున్న‌ట్టు శాస‌న స‌భ ప్రాంగ‌ణంలో చ‌ర్చ జ‌రుగుతోంది.

కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీ..! స్పీక‌ర్ గా పోచారం, ప్ర‌తిప‌క్ష నేత‌గా భ‌ట్టి విక్ర‌మార్క..!!

కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీ..! స్పీక‌ర్ గా పోచారం, ప్ర‌తిప‌క్ష నేత‌గా భ‌ట్టి విక్ర‌మార్క..!!

తెలంగాణలో రెండో ప్రభుత్వం కొలువుదీరింది. నామినేటెడ్‌ సభ్యుడితో కలిపి మొత్తం 120 మంది సభ్యులుండగా, గురువారం 114 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ స్పీకర్ గా బాద్య‌త‌లు చేప‌ట్టారు. ఇక, మిగిలిన పార్టీల నుంచి శాసనసభాపక్ష నేతల ఎంపిక తంతు లాంఛ‌న‌మే కాబ‌ట్టి త‌ర్వాత కార్య‌క్ర‌మాల‌పై స‌భ ద్రుష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ ది స‌రైన నిర్ణ‌యం అంటున్న నేత‌లు..!ప‌ద‌వికి విక్ర‌మార్క న్యాయం చేస్తార‌ని ప్ర‌శంస‌లు.!!

కాంగ్రెస్ ది స‌రైన నిర్ణ‌యం అంటున్న నేత‌లు..!ప‌ద‌వికి విక్ర‌మార్క న్యాయం చేస్తార‌ని ప్ర‌శంస‌లు.!!

ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనున్న కాంగ్రెస్ పార్టీ తరపున ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎల్పీ ఇచ్చిన నిర్ణయాధికారంతో.. భట్టి విక్రమార్కనే సీఎల్పీ నేతగా రాహుల్‌గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నేడు ప్ర‌తిప‌క్ష నేత‌గా విక్ర‌మార్క బాద్య‌త‌లు స్వీక‌రించారు.

కాంగ్రెస్ పార్టీతో సుధీర్గ ప్ర‌యాణం..! సేవ‌ల‌కు గుర్తింపు ల‌భించిందన్న భ‌ట్టి..!!

కాంగ్రెస్ పార్టీతో సుధీర్గ ప్ర‌యాణం..! సేవ‌ల‌కు గుర్తింపు ల‌భించిందన్న భ‌ట్టి..!!

గత అసెంబ్లీ సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి ముందుస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలలో సీనియర్‌గా ఉన్న భట్టి విక్రమార్కకు శాసనసభాపక్ష నేతగా అవకాశం దక్కింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన.. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. అంతకు ముందు కూడా ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు.

అదిష్టానానికి ధ‌న్య‌వాదాలు తెలిపిన భ‌ట్టి..! బాద్య‌త‌గా ఉంటాన‌న్న ప్ర‌తిప‌క్ష నేత‌..!

అదిష్టానానికి ధ‌న్య‌వాదాలు తెలిపిన భ‌ట్టి..! బాద్య‌త‌గా ఉంటాన‌న్న ప్ర‌తిప‌క్ష నేత‌..!

1990-92 మధ్య పీసీసీ కార్యవర్గ సభ్యుడిగా, 1994లో ఆంధ్రాబ్యాంక్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2000-03 మధ్య పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2009లో మధిర నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది చీఫ్‌ విప్‌గా ఎంపికై రెండేళ్లు కొనసాగారు. 2011 నుంచి డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగారు. 2014లోనూ మధిర నుంచే పోటీచేసి గెలుపొందారు. 2014లో తెలంగాణ మేనిఫెస్టోకమిటీ కో కన్వీనర్‌గా, 2014 నుంచి 2018 వరకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీనుండి తెలంగాణ శాస‌న స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

English summary
The first phase of the Telangana Legislative Assembly came to an end. Thanks to the Governor Speech, the first sworn affidavit, the Speaker of the Legislative Assembly, and the Opposition Leader's election has all been successful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X