One 8 Commune: హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. ఎక్కడంటే..!
భారత క్రికెట్ జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అతను మైదానంలోకి ఉడుగు పెడితే పరుగుల వరదే. విరాట్ కోహ్లీ క్రికెట్ లోనే కాకుండా బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు. అతను రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ 2017లో రెండు పేర్లతో రెస్టారెంట్ ప్రారంభించాడు. 'వన్ 8 కమ్యూన్' 'న్యూవా' పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి. వన్ 8 కమ్యూన్ ఢిల్లీ, ముంబయి, పూణే, కోల్‌కతా, బెంగళూరులో అనేక ప్రదేశాలలో ఉన్నాయి. ఇందులో రుచికరమైన వంటకాలను అందిస్తున్నారు.
రెస్టారెంట్ వాతావరణం మరపురాని జ్ఞాపకాలను కలిగి ఉండేలా రూపొందించారు. ఇప్పుడు,వన్ 8 కమ్యూన్ హైదరాబాద్‌కు రానుంది. ఈ రెస్టారెంట్ కోసం కింగ్ కోహ్లీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో విరాట్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహచరులు కొందరు కనిపించారు.

వన్ 8 కమ్యూన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఒక చిత్రాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఎప్పుడు వెళ్తామని చాలా మంది సిద్ధంగా ఉన్నారు. రెస్టారెంట్ ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. కాగా కోహ్లీ భారతీయ క్రికెట్ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 113 టెస్ట్ మ్యాచ్ ల్లో 8,848 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 29 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.
292 వన్డేల్లో 13,848 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 72 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ టీ20 వరల్డ్ ఆడి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకుంటున్నారు. కొందరేమో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో కొనసాగుతాడని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తన వ్యాపారలను చూసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications