హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టకీలా పబ్ లో అశ్లీలనృత్యాలు; 8మంది డ్యాన్సర్లతో పాటు 18మంది అరెస్ట్; సీఐ సస్పెన్షన్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రాడిసన్ బ్లూ పబ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ కేసు తర్వాత పబ్ లలో జరిగే కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని, అశ్లీలానికి తావు లేకుండా, డ్రగ్స్ కు అవకాశం లేకుండా పబ్ ల నిర్వాహణ చెయ్యాలని పోలీసులు పబ్ ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పబ్ ల నిర్వాహకుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఎప్పటిలాగే నిబంధనలకు విరుద్ధంగా పబ్ లు కొనసాగుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.

క్లబ్ టకీలా కేఫ్ అండ్ బార్ లో అశ్లీల నృత్యాలు.. టాస్క్ ఫోర్స్ దాడులు

క్లబ్ టకీలా కేఫ్ అండ్ బార్ లో అశ్లీల నృత్యాలు.. టాస్క్ ఫోర్స్ దాడులు

ఇక తాజాగా సికింద్రాబాద్లోని రామ్ గోపాల్ పేట లోని క్లబ్ టకీలా కేఫ్ అండ్ బార్ లో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి.అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలు చేస్తూ పార్టీ చేసుకుంటున్నారు అన్న సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. డీజే సాంగ్స్ కు డాన్సులు వేస్తూ, అశ్లీల నృత్యాలు చేస్తూ అక్కడ స్త్రీ, పురుషులు కనిపించారు. దీంతో అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహిస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

8మంది డ్యాన్సర్లు, కస్టమర్లు, నిర్వాహకులు అరెస్ట్ .. ప్రధాన నిందితుడి కోసం గాలింపు

8మంది డ్యాన్సర్లు, కస్టమర్లు, నిర్వాహకులు అరెస్ట్ .. ప్రధాన నిందితుడి కోసం గాలింపు


మొత్తం ఎనిమిది మంది డాన్సర్లు, ఎనిమిది మంది కస్టమర్ లతోపాటు డీజే ఆపరేటర్, పబ్ నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు క్లబ్ యజమాని అయిన గ్యారాల విజయ్ కుమార్ కోసం గాలింపు చేపట్టారు. బార్ అండ్ రెస్టారెంట్ ముసుగులో పబ్ ను నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసులు 294, 278 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులకు 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు.

టకీల పబ్ ఘటనపై సీపీ సీరియస్.. రాంగోపాల్ పేట్ సీఐపై సస్పెన్షన్ వేటు

టకీల పబ్ ఘటనపై సీపీ సీరియస్.. రాంగోపాల్ పేట్ సీఐపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్ నగరంలోని పబ్ ల నిర్వహణపై మొదటి నుంచి అనేక విమర్శలు ఉన్నాయి. పోలీసుల అండదండలతోనే పబ్ లు నిర్వహిస్తున్నారని అనేకమార్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తాజాగా రామ్ గోపాల్ పేట లో అశ్లీల నృత్యాలతో పబ్ ను నిర్వహించడంపై సిపి సివి ఆనంద్ సీరియస్ అయ్యారు. టకీల పబ్ విషయంలో కఠిన చర్యలకు దిగిన ఆయన రాంగోపాల్ పేట్ సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనను సీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

టకీలా పబ్ పై గతంలో రెండు సార్లు కేసులు .. ఇప్పుడు మళ్ళీ కేసు నమోదు

టకీలా పబ్ పై గతంలో రెండు సార్లు కేసులు .. ఇప్పుడు మళ్ళీ కేసు నమోదు

అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న పబ్ లపై చర్యలు తీసుకోవాలని చెప్పినా, నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే సీపీ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఇక రామ్ గోపాల్ పేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్చార్జిగా డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ ను నియమించారు. ఇదిలా ఉంటే క్లబ్ టకీలా కేఫ్ అండ్ బార్ పై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. గతంలోనూ నిబంధనలను తుంగలో తొక్కిందని, క్లబ్ నిర్వాహకులపై రెండుమార్లు కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా మరోమారు క్లబ్ టకీలా కేఫ్ అండ్ బార్ పై కేసు నమోదైంది.

English summary
Task force police have arrested 18 people, including eight dancers, for performing vulgar dances at the Tequila Pub in Ramgopal Peta. CP Gopal, who was serious about the incident, suspended Peta CI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X