పడిగాపులు కాశా.. కరోనా బారిన పడ్డ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కామెంట్స్

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అసలే ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఢిల్లీలో బాట పట్టినందుకే కరోనా వచ్చిందని హాట్ కామెంట్స్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం హస్తిన బాట పట్టిన.. అక్కడ తీరిక లేకుండా తిరిగామని.. అందుకే పాజిటివ్ వచ్చిందనే కామెంట్ చేశారు.

రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం వారు పండించిన ధాన్యం, బియ్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంపై రాత పూర్వక హామీ కోసం గత నాలుగు, ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాశారు. ఈ క్రమంలోనే తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం పర్యటన చేయగా.. తనకు పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొనడం సంచలనంగా మారింది. ఇప్పటికైనా కేంద్రం రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన కోరారు. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వాళ్ళు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు వహిస్తూ, వీలైనంత వరకు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కోరారు.

waiting in delhi, infected corona:minister errabelli dayakar rao

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఐసోలేషన్ లో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు అధికారులు, పి ఏలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైదరాబాద్‌లో, అటు హన్మకొండ, పాలకుర్తి, ఇతర మండల కేంద్రాల్లో అధికారులు, పీ ఏలు అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.

ఇటు యాసంగి పంటపై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కొనాలని రాష్ట్రం.. ఇదివరకు యాసంగి బియ్యం అప్పగించాలని కేంద్రం పరస్పర ఆరోపణలు చేస్తోంది. వరి పంట కొనుగోలు అంశానికి సంబంధించి దుమారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ చేశారు. అయితే తనకు కరోనా రావడానికి అదే కారణం అని పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది. హస్తినలో వెయిట్ చేశామని.. తిరిగామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+