హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల మాట: అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే, పోడు ప‌ట్టాలు ఇస్తాం

|
Google Oneindia TeluguNews

జ‌ల్ జంగ‌ల్, జ‌మీన్ కోసం గోండు నాయ‌క్, కొమురం భీం నుంచి ఆదివాసీల వ‌ర‌కు పోరాడుతూనే ఉన్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప‌దేళ్లుగా ఆదిలాబాద్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కు ఆదివాసీలు, ఫారెస్ట్ ఆఫీస‌ర్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. చాలా మంది ఆదివాసీ, గిరిజ‌నుల మీద అక్ర‌మ కేసులు పెడుతూనే ఉన్నారు. ఇటీవల ఖ‌మ్మం జిల్లాలో 21 మంది మ‌హిళ‌ల‌పై కేసులు పెట్టారు. చంటి పిల్లల త‌ల్లుల‌ను కూడా జైలులో వేసి, వెట్టిచాకిరి చేయించారు. పాచిపోయిన అన్నం పెట్టి, బూటు కాళ్ల‌తో త‌న్నారని గుర్తుచేశారు.

తెలంగాణ‌ రాష్ట్రంలో ఎక్క‌డికి వెళ్లినా ఆదివాసీలు, గిరిజ‌నులు ఫారెస్ట్ ఆఫీస‌ర్ల కాళ్ల‌పై ప‌డుతున్నారని... వాళ్ల‌ని బ‌తిలాడుతున్నారు, భూములు లాక్కోవ‌ద్ద‌ని ఏడుస్తున్నారని గుర్తుచేశారు. రెండేళ్ల కింద భ‌ద్రాద్రిలో 250 ఎక‌రాల గిరిజ‌న భూముల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుని, కోర్టుకు లాగారని వివరించారు. కోర్టుల చుట్టూ తిర‌గ‌లేక‌, ఫీజులు క‌ట్ట‌లేక 40 కుటుంబాలు మొత్తం గ్రామాన్ని ఖాళీ చేసి, వెళ్లిపోయాయని గుర్తుచేశారు. ఇవాళ లోటస్ పాండ్‌లో ఆదివాసీ ఆత్మీయ సమ్మేళ‌నంలో గిరిజన ప్రతినిధులతో ష‌ర్మిల సమావేశం అయ్యారు.

అసెంబ్లీ సాక్షిగా చెప్పి..

అసెంబ్లీ సాక్షిగా చెప్పి..

2005 అట‌వీ చ‌ట్టం ఎంతో అద్భుత‌మ‌ని కేసీఆర్ గ‌తంలో చెప్పారని షర్మిల గుర్తుచేశారు. ఆ చ‌ట్టాన్ని మాత్రం అమ‌లు చేయ‌డం లేదన్నారు. పోడు భూముల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. గ‌త ఏడేండ్లుగా గిరిజ‌నుల‌కు ఇదే హామీ ఇస్తూ మ‌భ్య‌పెడుతున్నారని అడిగారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న‌ సమయంలో 3.30 ల‌క్ష‌ల ఎక‌రాల పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇచ్చారని వివరించారు. ఆ త‌ర్వాత 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, ఏడేళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ఒక్క సీఎం కూడా ప‌ట్టాలు ఇవ్వలేదన్నారు. తెలంగాణ‌లో క‌నీసం 11ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పట్టాలు ఇవ్వాల‌ని గ‌త ప‌దేళ్లుగా పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. ప‌ట్టాలు ఇవ్వ‌క‌పోగా ఇచ్చిన వాటికి కూడా విలువ‌లేదని, వాటికి కూడా హ‌క్కులు క‌ల్పించ‌లేమ‌ని, ప‌ట్టాలు ఉన్నా కూడా రైతు బంధు, రైతు బీమా ఇవ్వ‌లేమ‌ని చెబుతున్నారు. కేసీఆర్ ప‌ట్టాలు ఇవ్వ‌రు. ఇచ్చిన‌వాళ్ల‌ను గౌర‌వించ‌రు. ఉన్నప‌త్రాలూ చెల్ల‌వ‌ని చెబుతున్నారు. హ‌రిత‌హారం కోసం గిరిజ‌నుల భూములే దొరికాయా? ఆదివాసీలు, గిరిజ‌నులు ఎదురు తిర‌గ‌లేర‌ని, త‌మ కాళ్ల మీద ప‌డి ఉండాల‌ని కేసీఆర్ విర్రవీగుతున్నారని షర్మిల ఫైరయ్యారు.

సమస్యల నిలయం..

సమస్యల నిలయం..


ఆదివాసీ స‌మ‌స్య‌ల‌పై ఆదివాసీ, గిరిజ‌న ప్ర‌తినిధులు ఆత్మీయ స‌మావేశంలో ఎన్నో అంశాలను వివరించారు. క‌రెంట్ లేద‌ని, రోడ్లు లేవ‌ని, విద్య‌, వైద్యం అంద‌డం లేద‌ని చెప్పారు. ఇది ఎంతో బాధాక‌రమైన విషయం అని షర్మిల అన్నారు. భూముల‌నే న‌మ్ముకుంటే అట్ట‌డుగున బ‌తుకుతున్న వారిలో ఆదివాసీలే ఎక్కువ‌. అలాంటి ఆదివాసీల భూముల‌ను సీఎం కేసీఆర్ అధికార మ‌దంతో లాక్కుంటున్నారు. ఆదివాసీ భూముల‌ను కార్పొరేట్ల‌కు క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తున్నారని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని వివరించారు. వైఎస్ఆర్ బ‌తికి ఉంటే పోడు భూముల‌ను ఎప్పుడో ప‌రిష్క‌రించేవారని పేర్కొన్నారు. ఆ మ‌హానుభావుడు ఇప్పుడు లేరు క‌నుక మేం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇస్తాం అని చెప్పారు. ఎన్ని ల‌క్ష‌ల ఎక‌రాలు ఉంటే అన్ని ల‌క్ష‌ల‌కు ప‌ట్టాలు ఇస్తాం అని వివరించారు. వారికి ప‌థ‌కాలు అమ‌లు చేస్తాం అని పేర్కొన్నారు. మాట మీద నిల‌బ‌డే వైఎస్ఆర్ బిడ్డ‌గా చెబుతున్నా.. వైఎస్ఆర్ పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇచ్చిన‌ట్లుగా.. తాము కూడా ఆదివాసీ గిరిజ‌నుల‌ను గౌర‌వించి వారికి ప‌ట్టాలు అంద‌జేస్తాం అని తెలిపారు.

Recommended Video

సింగరేణి బాదిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్న షర్మిళ!!
 గుర్తురానీ నిరుద్యోగులు

గుర్తురానీ నిరుద్యోగులు

నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్ప‌గానే అదే స‌మ‌స్య‌పై కాంగ్రెస్ పార్టీ పోరాటం మొద‌లు పెట్టిందని షర్మిల వివరించారు. ఏడేళ్లుగా గుర్తురాని నిరుద్యోగులు.. ఇప్పుడు గుర్తుకొచ్చారా అని అడిగారు. నిరుద్యోగుల‌తోపాటు ఆదివాసీల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావిస్తే దీనిని కూడా కాంగ్రెస్ పార్టీ కాపీ కొడుతుందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల‌ను ఎట్టిప‌రిస్థితుల్లో న‌మ్మ‌వ‌ద్దని సూచించారు. ఆ రెండు పార్టీలు గ‌తంలో అధికారంలో ఉన్నా.. పోడు స‌మ‌స్య‌ల‌ను క‌నీసం ప‌ట్టించుకోలేదన్నారు. మాట ఇస్తున్నాం. ఆదివాసీ, గిరిజ‌నులంద‌రికీ పోడు ప‌ట్టాలు ఇస్తాం అని వివరించారు. అడ్డు వ‌స్తే పోడు భూముల్లోనే కూర్చుని, సాగు చేసుకోండ‌ని చెబుతాం అని పేర్కొన్నారు. ఆదివాసీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కృషి చేస్తాం అని.. జ‌నాభా ప్ర‌తిపదిక‌న రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తాం అని షర్మిల స్పష్టంచేశారు.

English summary
we will give land documents to tribals ysrtp chief ys sharmila said. today tribal represents meet to her in lotus pond.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X