Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో పడి ముగ్గురు కార్మికుల మృతి..
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మ్యాన్ హోల్ లో పడి చనిపోయారు. శుక్రవారం సాయంత్రం కుల్సుంపురా వద్ద మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు.మృతులు ఎం శ్రీనివాస్(40), వి. హన్మంత్ (42), ఎం. వెంకటేశ్వర్ రావు (40) గా గుర్తించారు. శ్రీనివాస్ అనే పారిశుధ్య కార్మికుడు, మరికొందరు కార్మికులను మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు కంపెనీ నియమించిందని పోలీసులు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్ మ్యాన్‌హోల్ కవర్ తెరిచి బ్యాలెన్స్ తప్పి అందులో పడిపోయాడని కుల్సుంపురా సబ్-ఇన్‌స్పెక్టర్ బి. మన్మోహన్ గౌడ్ తెలిపారు. శ్రీనివాస్‌ను కాపాడేందుకు అతని సహోద్యోగులు హన్మంత్, వెంకటేశ్వర్‌రావు మ్యాన్‌హోల్‌లోకి దూకారని చెప్పారు. అయితే వారు విషవాయువు పీల్చి స్పృహతప్పారు. దీంతో వారు చనిపోయినట్లు వివరించారు.

వారిని ఆదుకునేందుకు ప్రయత్నించిన మరో సహోద్యోగి జీవన్ రాజ్ విషవాయువు పీల్చడంతో అస్వస్థతకు గురైనట్లు చెప్పారు.బాధితులను అయ్యప్ప ఇన్‌ఫ్రా కాంట్రాక్టు ఏజెన్సీలో రోజువారీ వేతనంపై పని చేసే కార్మికులు. కాంట్రాక్ట్ ఏజెన్సీ అయ్యప్ప ఇన్‌ఫ్రా తమ కార్మికులకు శ్వాస మాస్క్‌లు అందించడంలో విఫలమైందని, ఇది ముగ్గురు వ్యక్తుల మరణానికి దారితీసిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
పారిశుధ్య కార్మికుల మృతిపై కాంట్రాక్టు ఏజెన్సీపై హైదరాబాద్ పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.టెక్నాలిజీ ఎంత పెరిగినా కూడా ఇప్పటికే మనుషలతోనే మ్యాన్ హోళ్లను శుభ్రం చేయిస్తున్నారు. మ్యాన్ హోళ్లు శుభ్రం చేయడానికి మనుషులను ఉపయోగించకూడదని నిబంధనలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరహారం చెల్లించాలని కోరారు.












Click it and Unblock the Notifications