అగ్రరాజ్య పౌరసత్వం వదిలి, రాజకీయాల్లోకి ఎంట్రీ.. రెండోసారికి మేయర్ పదవీ..
గ్రేటర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మీ ఎన్నిక జరిగింది. మేయర్ పీఠం కోసం పోటీ ఉన్న పదవీ మాత్రం ఆమెనే వరించింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ మద్దతు ఇవ్వడంతో ఎన్నిక నల్లేరుమీద నడకలా సాగింది. అయితే విజయలక్ష్మీ.. కే కేశవరావు కూతురుగానే తెలుసు.. ఆమె రాజకీయ నేపథ్యం ఎలా సాగింది..? పాలిటిక్స్‌లోకి ఎలా వచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆమెను రాత్రికి రాత్రే పదవీ వరించలేదు. మేయర్ పదవీ కోసం నిరీక్షించగా.. వచ్చింది.

రెండోసారి కార్పొరేటర్‌గా విజయం
బంజారాహిల్స్ డివిజన్ 93 కార్పొరేటర్ గత ఎన్నికల్లో విజయలక్ష్మీ విజయం సాధించారు. అయితే అప్పుడే ఆమె పేరు మేయర్ రేసులో వినిపించింది. సమీకరణాల నేపథ్యంలో మేయర్ పదవీ బొంతు రామ్మోహన్‌కు వరించింది. దీంతో ఐదేళ్లు నిరీక్షించారు విజయలక్ష్మీ. ఎక్కడ కూడా తనకు పదవీ దక్కలేదు అని అనుకోలేరు. పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారు.

హైదరాబాద్‌లో విద్య
విజయలక్ష్మి బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. హోలీ మేరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. రెడ్డి మహిళా కాలేజీలో చదివారు. భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం పూర్తి చేశారు. తర్వాత సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. తర్వాత బాబీ రెడ్డితో పెళ్లి జరిగింది. తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. 18 ఏళ్లపాటు అక్కడే ఉన్నారు. అగ్రరాజ్యంలో నార్త్ కరోలినా యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేశారు. 2007లో భారత్ తిరిగొచ్చారు.

రాజకీయాల్లోకి రాక..
రాజకీయాల్లో తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు. ఇందుకోసం ఆమె అమెరికా పౌరసత్వాన్ని కూడా వదిలేసుకున్నారు. 2016లో టీఆర్ఎస్ పార్టీ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరో సారి విజయం సాధించారు. మేయర్ పీఠం రేసులో పేరు వినిపించింది. సామాజిక సమీకరణాలు, మేయర్, డిప్యూటీ మహిళలకే ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయించింది. దీంతో మేయర్ పదవీని చేపట్టారు.












Click it and Unblock the Notifications