నయీమ్ కేసు దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతుంది: దాసోజు శ్రావణ్

గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నాయి. కానీ పూర్తి స్థాయి దర్యాప్తు మాత్రం జరగలేదు. ఈ కేసులో జాప్యం ఎందుకు జరుగుతుంది అని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రశ్నించారు. నయీమ్ బ్లూ డైరీ, స్వాధీనం చేస్తున్న వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు, సిట్ దర్యాప్తు చేసిన వివరాలను ప్రభుత్వం ఎందుకు ప్రజల ముందు పెట్టలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆరోపణలు ఉన్నా.. కేసులు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు.

చిన్న స్థాయి పోలీసు అధికారులపై చర్యలు మినహా చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఐదేళ్లవుతున్నా పూర్తి స్థాయి చార్జిషీట్లు నమోదు చేయలేదని శ్రవణ్ ఆరోపించారు. నయీమ్ బాధితుల్లో ప్రభుత్వం.. ఎంతమందికి న్యాయం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ ఎంక్వయిరీ వేయాలనే ప్రతిపక్షాల డిమాండ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గతంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి ఉన్నందునే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సిట్‌ రిపోర్ట్, నయీమ్ బ్లూ డైరీని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

why delay of nayeem case investigation: sravan

అయితే గ్యాంగ్ స్టర్ నయీం అస్తుల చిట్టా మూడేళ్ల‌ క్రిత‌మే బయ‌టపడింది. 2వేల కోట్ల అస్తులు ఉన్నట్లు సిట్ అధికారులు మీడియా ముందు ప్ర‌క‌టించారు. మూడు నెల్ల‌ల్లోనే అంతా పూర్తి చేస్తామ‌ని చెప్పారు. నయీంతో కలిసి 25 మంది పోలీసులకు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చి.. కొద్దిమంది ఉన్న‌తాధికారుల‌ను స‌స్పెండ్ చేసి వారి పాత్ర కూడా లేద‌ని మ‌ళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. ఐదేళ్లు గ‌డిచినా బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేదు.

Recommended Video

    Spl Report On Etala Rajendar Allegations On Kcr || Oneindia Telugu

    2 వేల కోట్ల అస్తుల్లో 1019 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి.. 29 క‌మ‌ర్షియ‌ల్, రెసిడెన్స్ ప్లాట్స్, రెండు కిలోల బంగారం, 2 కోట్ల న‌గ‌దు ఉంది. దాదాపు 850 మంది బాధితులు సిట్ ఎర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కి ఫిర్యాదు చేశారు. 251 కేసుల వరకు న‌మోదు చేశారు. 90 రోజుల్లో చార్జ్ షీట్ దాఖ‌లు చేసి తేల్చాల్సిన పోలీసులు.. 18 వందల రోజులైనా ఒక్క‌రికీ శిక్ష ప‌డేలా చేయ‌లేదు. 175 కేసుల్లో మాత్ర‌మే చార్జ్ షీట్ దాఖ‌లు చేసి చేతులు దులుపుకున్నారు. 70 కేసులు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. బాధితులు త‌మ‌కెప్పుడు న్యాయం జ‌రుగుతుందా.. అని కళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూడ‌టం త‌ప్ప ఏం చేయ‌లేని నిస్సహాయత స్థితిలో ఉన్నారు. దీనినే కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+