ప్రియుడి మోజులో భర్తను మట్టుబెట్టిన భార్య
హైదరాబాద్ : పెళ్లి అంటే అంటే విలువలేకుండా పోతోంది. దీనికి ప్రధాన కారణం వివాహనికి ముందే సంబంధాలు, మరికొన్ని సందర్భాల్లో పెళ్లైన వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ భార్య, భర్తలను మట్టుబెడుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపిన భర్త మృతికి భార్యే కారణమని పోలీసుల విచారణలో తేలింది.
పథకం ప్రకారం ..
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఇస్మాయిల్‌కు హైదరాబాద్ కిషన్ బాగ్‌కు చెందిన అనిస్ భేగంతో పెళ్లైంది. కానీ పెళ్లికి ముందే అనిస్‌కు కిషన్ బాగ్‌కు చెందిన సయ్యద్ జహీర్‌తో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లైన అనిస్‌లో మార్పు రాలేదు. వారి సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

వీరి సంబంధంపై భర్త ఆరాతీశాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. దీంతో కక్ష పెంచుకున్న అనిస్ .. ప్రియుడితో కలిసి వ్యుహరచన చేసింది. ఎలాగైనా ఇస్మాయిల్‌ను మట్టుబెట్టాలని భావించింది. ఈ మేరకు సయ్యద్ .. తన స్నేహితులతో కలిసి రెక్కీ నిర్వహించాడు. అందులో భాగంగా ఈ నెల 16న ఇస్మాయిల్‌కు మందు తాగించారు. తర్వాత మాట మాట పెరిగి .. పథకం ప్రకారమే ముందే క్రికెట్ బ్యాట్ తెచ్చుకున్న బ్యాటుతో దాడి చేశాడు సయ్యద్. దీంతో తలకు తీవ్రగాయమై ఇస్మాయిల్ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు అనుమానం వచ్చి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారించారు. హంతకులు వాడిన బ్యాట్, రెండు మొబైల్స్, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications