Thrill City: థ్రిల్ సిటీపై చర్యలు తీసుకుంటారా.. హైడ్రా ఏం చెబుతోంది..!
హైడ్రా.. హైదరాబాద్ లో ఏ ఇద్దరు కలిసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. తమ ఏరియా బఫర్ జోన్ లో ఉందా అని చర్చించుకుంటున్నారు. హైడ్రా వచ్చిన నుంచి అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. తమ కబ్జాలకు ఇక కాలం చెల్లిందని బాధపడుతున్నారు. హైడ్రా ఇప్పటికే చాలా అక్రమ కట్టడాలను నేల మట్టం చేసింది. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూడా హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇక నటుడు మురళీ మోహన్ కు చెందిన జయభేరి సంస్థకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది.
అంతే కాదు బఫర్, ఎఫ్టీఎల్ లో నిర్మించిన విల్లాలను కూల్చివేశారు. అయితే హైడ్రాను ఎక్కువ మంది స్వాగతిస్తుంటే.. కొంత మంది హైడ్రా వద్దని చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ లో చాలా చెరువులు ఉండేవని.. ఇప్పుడు ఇందులు 60 శాతం చెరువులు కబ్జాకు గురయ్యాయని అధికారులు తెలుపుతున్నారు. ఇలానే ఉంటే హైదరాబాద్ ఒక్క చెరువు కూడా ఉండదని హైడ్రా చెబుతోంది. ఒక వేళ ఇదే జరిగితే.. హైదరాబాద్ భారీ వర్షాలు కురిస్తే వరదలు ఖాయమని చెబుతున్నారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెరువులు కబ్జా కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. అక్రమార్కుల నుంచి చెరువులను కాపాడుతామన్నారు. హైడ్రా కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటుంది. అయితే కొంత మందికి చెందిన నిర్మాణాలపై హైడ్రా చేయి వేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ పక్కకు థ్రిల్ సిటీ ఉందని.. ఇది బఫర్ జోన్ లోనే ఉందని ఆరోపణలు ఉన్నాయి. థ్రిల్ సిటీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
థ్రిల్ సిటీపై హైడ్రా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. థ్రిల్ సిటీపై హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు సామాన్యులు నివాసం ఉండే ఇళ్లను ముట్టుకోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా చాలా చెరువులు కబ్జాదారులు చేతుల్లోనే ఉన్నాయని వాటిని రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications