మన పెళ్లి రోజు శుభాకాంక్షలు, గత ఏడాది ఇదే రోజు కోసం ఎదురు చూశా!: ప్రణయ్‌కు అమృత!
Recommended Video

నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో గత ఏడాది ప్రణయ్ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రోజు (బుధవారం) ప్రణయ్ - అమృతల పెళ్లి రోజట. ఈ నేపథ్యంలో తమ పెళ్లి రోజు సందర్భంగా అమృత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

ప్రణయ్‌కి అమృత శుభాకాంక్షలు
జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరుతో ఆయన సతీమణి అమృత ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రణయ్, తాను కలిసి తీసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. మన పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు అని ఆమె పేర్కొన్నారు. మన పెళ్లి జరిగి నేటికి ఏడాది అని పేర్కొన్నారు.
ఇదో రోజు నీతో చేయి కలిపేందుకు ఎదురుచూశా
గత ఏడాది ఇదే రోజున నిన్ను కలుసుకునేందుకు, నీ చేతిని పట్టుకుని నడిచేందుకు ఎంతో ఆతృతతో ఎదురు చూశానని అమృత పేర్కొన్నారు. ఇప్పుడు మన చిన్నారిని ఎత్తుకునేందుకు ఎదురుచూస్తున్నానని, ఈ కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నానని, లవ్ యూ.. నిన్ను చాలా మిస్ అవుతున్నానని పోస్ట్ చేశారు. కాగా చాలామంది వెడ్డింగ్ యానివర్సరి గ్రీటింగ్స్ చెప్పారు. అమృత.. మీ వెంట మేమున్నామని చెబుతున్నారు.

నెలలకు ముందు హత్యకు గురయ్యాడు
ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అదే పట్టణానికి చెందిన అమృతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది ఇదే సమయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె గర్భం ధరించింది. మరి కొన్ని నెలల్లో అమృత బిడ్డకు జన్మనిస్తుందనగా ప్రణయ్ హత్యకు గురయ్యాడు.












Click it and Unblock the Notifications