హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియా యూనివర్సిటీలో పాముల బెడద .. పాముకాటుకు మహిళా ఉద్యోగిని మృతి; ఆందోళన!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పాముల బెడద ఎక్కువైపోయింది. ఓయూలో పాములు హల్చల్ చేస్తున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ లో లేడీస్ హాస్టల్ లో పనిచేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ మహిళ ఉద్యోగిని పాముకాటుతో మృతి చెందడంతో ఉస్మానియా యూనివర్సిటీ లో భయాందోళన కలిగిస్తున్న పాములను పట్టించుకోని వైనంపై చర్చ జరుగుతుంది.

పాముకాటుతో ఓయూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి

పాముకాటుతో ఓయూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి


ఓయూ హాస్టల్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని పాముకాటుతో మృతి చెందింది. కవిత అనే కాంట్రాక్టు ఉద్యోగిని వంట చేస్తూ ఉండగా పాము కాటు వేసింది. ఆపై పాము కలుగులోకి దూరిపోయింది. తనను పాము కరిచిందని చెప్పినా అక్కడ ఉన్న సిబ్బంది కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఎవరూ పట్టించుకోలేదని, తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని, ఈ ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు.

ఆస్పత్రులలోనూ పట్టించుకోని వైనం .. మహిళా ఉద్యోగిని ప్రాణాలు గాల్లో

ఆస్పత్రులలోనూ పట్టించుకోని వైనం .. మహిళా ఉద్యోగిని ప్రాణాలు గాల్లో

ఇక పాము కరిచిన వెంటనే తన కుటుంబ సభ్యులకు, బంధువులకు, తోటి ఉద్యోగులకు చెప్పిన కవిత తనను కాపాడాలని విజ్ఞప్తి చేశారని, అయినా ఫలితం లేకుండా పోయిందని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాము కరిచిన తర్వాత రక్తం, నురగలు కక్కుతూ ఇబ్బంది పడుతున్న మహిళా ఉద్యోగినిని ఆసుపత్రులకు తీసుకు వెళితే, చాలాచోట్ల ఈ కేసు తాము చూడమంటూ ఆసుపత్రుల్లో వైద్యులు బయటకు పంపించి వేశారని, చివరకు మహిళా ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు.

పాముకాటు వ్యవహారం బయటకు రాకుండా జాగ్రత్త పడిన యూనివర్సిటీ అధికారులు

పాముకాటు వ్యవహారం బయటకు రాకుండా జాగ్రత్త పడిన యూనివర్సిటీ అధికారులు


ప్రైవేట్ ఆసుపత్రులలో ఎవరూ ఈ కేసు చూడకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన గంటల వ్యవధిలోనే ఓయూ కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగిని కవిత మృతి చెందారు. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అని చెబుతున్నారు. పాము కాటు వల్ల కాంట్రాక్టు ఉద్యోగిని కవిత మృతిచెందడంతో సమాచారం బయటకు రాకుండా ఓయూ అధికారులు, కాంట్రాక్టర్లు దాచిపెట్టారని చెప్తున్నారు. ఈ వ్యవహారం బయటకు వస్తే యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి పెరుగుతుందని వారు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

Recommended Video

దమ్ముంటే రాజీనామా చెయ్యండి, ఈటల రాజేందర్ సవాల్ *National |Telugu OneIndia
విద్యార్ధి సంఘాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన.. 50 లక్షల పరిహారం డిమాండ్

విద్యార్ధి సంఘాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన.. 50 లక్షల పరిహారం డిమాండ్

దీంతో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ లేడీస్ హాస్టల్ ముందు నిరసన ధర్నాకు సిద్ధమయ్యారు విద్యార్థి సంఘాల నాయకులు. కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని కవిత కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నాయకులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
An outsourcing woman employee working in ladies hostel in Osmania University has died of snakebite. Due to the death of Kavitha, the family of her is demanding a compensation of 50 lakh rupees..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X