హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని అరెస్ట్: భర్త, మరో ఇద్దరితో కలిసి అమ్మకాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్, గంజాయి కలకలం రేపుతున్నాయి. విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులే ఈ వ్యవహారాల్లో కీలకంగా మారుతుండటం గమనార్హం. ఒకరోజు క్రితం ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్స్ కు బానిస మరణించిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ మహిళా సాఫ్ట్‌వేర్ గంజాయి విక్రయిస్తూ పట్టుపడటం కలకలం సృష్టిస్తోంది.

గంజాయికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకొనేందుకు అరకు నుంచి సరకు తీసుకొచ్చి మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని కొండపనేని మాన్సీని బోయిన్‌పల్లి పోలీసులు గురువారం మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో అరెస్ట్‌ చేశారు. నాచారంలో ఉంటూ ఓ ఎంఎన్‌సీ(ఐటీ)లో పనిచేస్తున్న మాన్సీ.. భర్త మదన్‌ మనేకర్‌తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తుండటం గమనార్హం.

woman IT employee selling cannabis in hyderabad, held.

మార్చి 12న ఈ దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకునేందుకు వెళ్లారు. 1.2 కిలోల గంజాయితో యువకులిద్దరూ చిక్కగా దంపతులు పారిపోయారు. వారిచ్చిన సమాచారంతో గాలిస్తుండగా కొంపల్లి వద్ద గురువారం మాన్సీని పట్టుకున్నారు పోలీసులు.

ఏపీకి చెందిన ఆమె పూర్వీకులు నాగ్‌పుర్‌ జిల్లాలో వ్యవసాయంలో స్థిరపడ్డారు. భోపాల్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్‌ వచ్చింది. నాచారంలో మూడేళ్లుగా భర్తతో కలిసి ఉంటోందని ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగులు, యువకులే లక్ష్యంగా గంజాయి అమ్ముతున్నట్లు వెల్లడించారు.

English summary
woman IT employee selling cannabis in hyderabad, held.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X