హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లి కాదు రాక్షసి.. ప్రియుడితో కలిసి కుమారుడి హత్య, అమానుషం..

|
Google Oneindia TeluguNews

కలికాలం.. డెవలప్ జరుగుతోన్న.. ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. కొందరు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వివాహేతర సంబంధాలకు అలవాటు పడీ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. పేగు తెంచుకొని జన్మించిన బిడ్డలతో ముర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు హతమార్చి.. మిన్నకుండిపోతున్నారు. భాగ్యనగరంలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ వివాహిత తన కుమారుడిని కసితీరా కొట్టింది. బాలుడు చనిపోయాక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ దొంగ ఏడుపు ఏడ్చింది.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..


అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి కొడుకును తీవ్రంగా కొట్టింది. దీంతో ఆ బాలుడు కన్నుమూశాడు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భగత్ సింగ్ నగర్‌లో నివసిస్తున్న సురేష్, ఉదయ భార్యా భర్తలు ఉండేవారు. వారికి ఉమేష్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉదయ, భాస్కర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఇక్కడ ట్విస్ట్..

సహజీవనం చేస్తూ..

సహజీవనం చేస్తూ..


రెండేళ్ల క్రితం కొడుకును తీసుకుని భర్తతో విడిపోయి భాస్కర్‌తో కలిసి జీవిస్తోంది. అయితే మంగళవారం ఏం జరిగిందో తెలియలేదు. ఉదయం వేళ కోపంలో ఉన్న ఉదయ కొడుకు ఉమేష్‌ను తీవ్రంగా కొట్టింది. ఆ దెబ్బలకు బాలుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే బాలుడిని సూరారంలో గల మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఉదయ భర్త సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అడ్డు ఉన్నాడని..

అడ్డు ఉన్నాడని..

భాస్కర్, ఉదయపెళ్లి చేసుకోవాలని అనుకున్నారని సురేశ్ తెలిపారు. పెళ్లికి తన కుమారుడు అడ్డువస్తున్నాడని చెప్పారు. అందుకోసమే ఇద్దరూ కలిసి కొట్టి హత్య చేశారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తపై కోపంతోనే ఉదయ.. బాలుడిని కొట్టినట్టు తెలుస్తోంది. సురేశ్ మాత్రం పెళ్లికి అడ్డువస్తున్నాడని కొట్టారని అంటున్నారు. దీనికి సంబంధించి విచారణలో నిజనిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

English summary
woman kills her son for extra marital affair issue. incident happened at hyderabad jeedimetla police station limits
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X