కేఏ పాల్‌తో కలిసి పనిచేస్తా, గద్దర్ ప్రకటన.. మరో 12 మంది కూడా
ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు నేతల మద్దతు లభిస్తోంది. కలిసి పనిచేసేందుకు నేతలు ముందుకు వస్తున్నాయి. ఆయన నెలకొల్పిన గ్లోబల్ హోస్ట్ సంస్థతో కలిసి పనిచేస్తామని ప్రజా గాయకుడు గద్దర్ ప్రకటించారు. గ్లోబల్‌హోస్ట్ కమిటీలో జేడీ లక్ష్మీనారాయణ, జస్టిస్ చంద్రకుమార్, విమలక్కతోపాటు మరో 12 మంది ఉన్నారని తెలిపారు.
కమిటీలో పనిచేయడానికి అనేకమంది ప్రముఖులు ముందుకువస్తున్నారని ఆయన తెలిపారు. కేవలం ప్రపంచశాంతి, హక్కుల కోసం ఈ సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. సమస్యలపై మాత్రం వర్క్ చేస్తోందని తెలియజేశారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

కేఏ పాల్ 59వ పుట్టిన రోజు ఈ నెల 25వ తేదీ అని.. ఆ లోపు మునుగోడు నియోజకవర్గంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి కోసం స్థలాన్ని కొనుగోలు చేస్తామని అంటున్నారు. ఆసుపత్రిని నిర్మించే యోచనలో కేఏ పాల్ ఉన్నారని వెల్లడించారు. ఆ విషయం ప్రజలకు తెలియజేయాలని తనను పాల్ ఇక్కడికి పంపించారని గద్దర్ తెలిపారు.
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పాల్ యాక్టివ్ అయ్యారు. సమస్యలపై గళం విప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సదరు పార్టీలకు బుద్ది చెప్పాలని కోరుతున్నారు. ఆ మేరకు జనం నుంచి స్పందన లభిస్తోంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications