హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం.. కాళేశ్వరం విశిష్టతలేంటంటే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేష‌న్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. మేడిగడ్డ దగ్గర శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో వేదోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య‌ జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహించారు. గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించిన వేదపండితులు.. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మహాసంకల్ప యాగం నిర్వహించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం విశిష్టతలు అన్నీ ఇన్నీ కావు. అతి తక్కువ వ్యవధిలో రెండేళ్లు నిర్విరామంగా శ్రమించి ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడం విశేషం.

 147 టీఎంసీల సామర్థ్యం.. ప్రపంచంలోనే అతి పెద్దది

147 టీఎంసీల సామర్థ్యం.. ప్రపంచంలోనే అతి పెద్దది

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం రూపుదిద్దుకుంది. 147 టీఎంసీల సామర్థ్యంతో మహా లిఫ్ట్ ఇరిగేషన్‌గా అవతరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 80 వేల 500 కోట్ల రూపాయలు కాగా.. దాని నిర్మాణానికి ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ అతిపెద్ద ఎత్తిపోతల పథకంలో మొత్తం 19 పంపింగ్ హౌస్‌లు నిర్మించారు. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 82 సంపులతో పాటు భారీ మోటార్లు వినియోగిస్తున్నారు.

ఇప్పటిదాకా 10 లక్షలు, ఇప్పుడేమో లక్ష.. 9999 క్రేజ్ తగ్గిందా.. లేదంటే గోల్‌మాలా?ఇప్పటిదాకా 10 లక్షలు, ఇప్పుడేమో లక్ష.. 9999 క్రేజ్ తగ్గిందా.. లేదంటే గోల్‌మాలా?

ఎన్నో విశిష్టతలు.. మరెన్నో లక్ష్యాలు

ఎన్నో విశిష్టతలు.. మరెన్నో లక్ష్యాలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మొత్తం 15 వందల 31 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వలు నిర్మించారు. అంతేగాకుండా దాదాపు 203 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం తవ్వించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎత్తిపోతలకు 4వేల 992 మెగావాట్ల విద్యుత్ వినియోగించనున్నారు. దీని ద్వారా ప్రస్తుతం రోజుకు రెండు టీఎంసీల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయనున్నారు. అనంతరం రానున్న రోజుల్లో ప్రతినిత్యం మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

 సాగునీరు.. తాగునీరు.. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని

సాగునీరు.. తాగునీరు.. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని


ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా అభివర్ణించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 13 జిల్లాల్లోని 106 మండలాలకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు 15 వందల 81 గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అయితే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండగా.. కొత్తగా 18 లక్షల 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభించనుంది. అదలావుంటే హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి అందనుంది. అదలావుంటే పారిశ్రామిక అవసరాలకు దాదాపు 16 టీఎంసీలు కేటాయించనున్నారు.

మారనున్న తెలంగాణ ముఖచిత్రం

మారనున్న తెలంగాణ ముఖచిత్రం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ తో తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రమే మారనుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రికార్డు వేగంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తిచేయడం మరో విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పంప్‌హౌస్‌లోని ఆరో మోటార్‌ను ప్రారంభించారు. దాంతో కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలు ఉబికి వచ్చాయి. కన్నెపల్లి భూగర్భ పంప్‌హౌస్‌లో మొత్తం 11 భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ మోటార్లు 40 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీటిని 48 మీటర్ల ఎగువకు ఆ మోటార్లు ఎత్తిపోయనున్నాయి.

English summary
Worlds Largest Lift Irrigation Project Kaleshwaram Specialities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X