హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇస్లాంలో హత్య అనేది ఘోరమైన నేరం: అసదుద్దీన్, రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు

|
Google Oneindia TeluguNews

నాగరాజు హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పలువురు ఖండించారు. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజును ఆమె సోదరుడు మరొకరితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హత్య అనేది ఇస్లాంలో ఘోరమైన నేరం అని చెప్పారు. ఇప్పటికే నిందితులు అరెస్ట్ అయ్యారని వివరించారు. కానీ కొందరు మాత్రం దీనికి వేరే రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ సరికాదని అసద్ సూచించారు.

 ఇస్లాంకు వ్యతిరేకం..

ఇస్లాంకు వ్యతిరేకం..


హత్య ఇస్లాం మతానికి వ్యతిరేకంగా జరిగిందని అసదుద్దీన్ అన్నారు. అమ్మాయి ఇష్టపూర్వకంగా అతనిని పెళ్లి చేసుకుందని, ఇందుకు చట్టం కూడా అనుమతి ఇస్తుందని తెలిపారు. నాగరాజును చంపే హక్కు అతనికి సోదరుడికి లేదని చెప్పారు. ఇదీ నేరపూరిత చర్య అని.. ఇస్లాంలో ఘోరమైన నేరం అని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. నిందితులు సయ్యద్‌ మోబిన్‌ అహ్మద్, మసూద్ అహ్మద్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

 ముందే స్కెచ్

ముందే స్కెచ్


ఇటు నాగరాజు పరువు హత్యలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో హత్యకు గల కారణాలు, నిందితులు వేసిన స్కెచ్‌ వివరించారు. నాగరాజు, ఆశ్రిన్ మధ్య చిన్నప్పటి నుండి స్నేహం కొనసాగుతోందని చెప్పారు. అది ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదరించి జనవరి 31వ తేదీన ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. నాగరాజు మలక్‌పేట‌లో కార్ల షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసేవాడు. ఎక్కడ ఉన్నామనే సమాచారం తెలియకుండా జాగ్రత్తపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ వారికి చిక్కి నాగరాజు హత్యకు గురయ్యారు.

 స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసి..

స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసి..


తన సోదరి అశ్రిన్ సుల్తానాను పెళ్లి చేసుకున్నాడనే కక్షతో నాగరాజును చంపాలని ఆమె సోదరులు నిర్ణయం తీసుకున్నారు. అతనికి తెలియకుండా మొబైల్‌లో స్పై‌వేర్ యాప్ ఇన్‌స్టాల్ చేశారు. అతని కదలికలు ఎప్పటికప్పుడు గమనించేవారు. నాగరాజు హత్యకు నిందితుడు ముందుగానే స్కెచ్ వేసుకున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో అదీ ఆలస్యమైంది. పండగ ముగియగా.. స్కెచ్‌ ప్రకారం రంగంలోకి దిగారు. 4వ తేదీన రాత్రి బైక్‌పై అశ్రిన్‌తో కలిసి వెళ్తున్న నాగరాజును నిందితుడు దాడి చేసి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై చంపేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ త్వరగా జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాల్సి ఉంది.

English summary
AIMIM chief Asaduddin Owaisi has condemned the suspected honour killing of a Dalit man by the family of his Muslim wife in Hyderabad, deploring the act of murder as “the worst crime in Islam”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X