ఎమ్మెల్యేల కొనుగోలు సినిమా రిలీజ్, ఇప్పుడు కవితపై కేసీఆర్ నాటకం: షర్మిల సెటైర్లు
హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. తెలంగాణలో భూకబ్జాలు, కమీషన్లతోన్ల ఎమ్మెల్యేలు యథాలీడర్ తథా క్యా డర్లా తయారయ్యారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా మానకొం డూరు
నియోజకవర్గంలోని తిమ్మా పూర్, ముంజపల్లి, ల్లిమానకొం డూరు, ఈదులగుట్టపట్టల్లిలో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వ హించారు షర్మిల.

ఎమ్మెల్యే రసమయికి వందల కోట్లు ఎలా వచ్చాయన్న షర్మిల
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజలు సమస్యలు విన్నవిద్దామంటే ఎమ్మెల్యే కనబడటం లేదని విమర్శిం చారు.పోలీసులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆయనను నియోజకవర్గానికి తీసుకురావాలంటూ చురకలంటించారు. తెలంగాణ ఉద్యమంలో రసమయి బాలకిషన్ కళాకారుడుగా ఎంతో మంచి పేరుండేదని.. అయితే, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఇప్పుడు కళాకారుడు కాస్తా రౌడీగా మారాడని తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్‌కు నీళ్లు తీసుకుపోతే.. తాను మాత్రం తక్కువనా అన్నట్లు ఎమ్మెల్యే రసమయి తన ఫాంహజ్‌కు కాళేశ్వరం నీళ్లు తీసుకెళ్లాడని విమర్శిం చారు.మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ రూ. లక్ష ఉండగా, ప్రస్తుతం రూ. వందల కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు షర్మిల.

లిక్కర్ స్కాంలో కవిత.. కేసీఆర్ కొత్త కథ అంటూ షర్మిల
లిక్కర్ స్కాంలో ఇరుకున్న కవిత కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇప్పుడు కేసీఆర్ కొత్త కథ అల్లుతున్నారని షర్మిల మండిపడ్డారు. లిక్కర్ స్కాం లో అరెస్ట్ చేస్తే పార్టీలో
చేరనందుకని చెబుతారేమోనని ఎద్దేవా చేశారు. అదే నిజమైతే నలుగురు
ఎమ్మెల్యేల గురించి చెప్పినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదని సీఎం కేసీఆర్‌ను వైఎస్ షర్మిల ప్రశ్నిం చారు.
నలుగురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ సినిమా అంటూ షర్మిల సెటైర్లు
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఓ బూటకమన్నారు షర్మిల. ఎమ్మెల్యేలతో నాలుగు స్తంభాలాట అనే సినిమాను సీఎం కేసీఆర్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మడం లేదన్నారు. కేసీఆర్ బుధవారం జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో షర్మిల ఈ మేరకు స్పందించారు. దేశానికి బీజేపీ రూపంలో పట్టినట్టి చెదలును తొలగించే బాధ్యతను టీఆర్ఎస్ శ్రేణులు తీసుకోవాలని కేసీఆర్ అన్నారు. ప్రతీ ఒక్కరూ తనలా పనిచేయాలని టీఆర్ఎస్ నేతలకు సీఎం సూచించారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరమని బీజేపీ అడిగిందని.. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. కరీంనగర్‌కు ఎంపీ బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications