రోడ్డెక్కాల్సిందే.. విద్య, వైద్యం.. పంట విక్రయం కూడా.. షర్మిల సెటైర్లు
ఇప్పుడు సందు దొరికితే చాలు.. వైఎస్ షర్మిల కూడా రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ప్రజలను పట్టించుకోవడం లేదని.. సంక్షేమాన్ని మరచారని ఫైర్ అవుతున్నారు. రాములమ్మ విజయశాంతి, జేజమ్మ డీకే అరుణ మాదిరిగా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణలో ప్రజలు ప్రతీ అంశం కోసం రోడ్డెక్కాలీ అని ఫైరయ్యారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు.
తెలంగాణలో కొనుగోలు సెంటర్లలో వడ్లు కొనడం లేదు. అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారని దినపత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆలస్యంగా కొంటున్నారని ఆ కథనంలో ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన షర్మిల.. తెలంగాణలో ప్రతి రంగంలోనూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సి వస్తోందని అన్నారు.
విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి..న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడెక్కాలి..
— YS Sharmila (@realyssharmila) May 30, 2021
కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల తరబడి పంట కొనుగోలు కేంద్రాల్లో..
వడ్లు వర్షం పాలైతున్నయి అని మొత్తుకుంటున్నా..మీకు రైతు గోస కనుపడదు.. వినపడదు.. pic.twitter.com/KBCpDVEuc0
విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల తరబడి పంట కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వర్షం పాలైతున్నయి అని మొత్తుకుంటున్నా మీకు రైతు గోస కనపడదు.. వినపడదు..' అని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

గత కొద్దీరోజుల నుంచి షర్మిల రెచ్చిపోతున్నారు. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ప్రతీ అంశంలో ప్రజలకు ఇబ్బందులు తప్పవా అని విరుచుకుపడ్డారు. అన్నదాతల ఉసురు తగులుతుందని శాపనాలు పెడుతున్నారు. తెలంగాణలో తమ పార్టీ రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక కాబోతుందని కామెంట్ చేస్తున్నారు. ఇదీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications