హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల, విజయలక్ష్మి కేసు విత్ డ్రా..?

|
Google Oneindia TeluguNews

వైఎస్ షర్మిళ, వైఎస్ విజయమ్మలపై పరకాల కేసును ఉపసంహరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరకాలలో 2012 అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని వీరిద్దరిపై అభియోగం మోపారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విజయమ్మ, షర్మిళ, కొండా సురేఖ, కొండా మురళీపై విచారణ చేశారు. ప్రాసిక్యూషన్ ఉపసంహరణ పిటిషన్ వేయనున్నట్లు పీపీ కోర్టుకు తెలిపారు.

సంబంధిత అధికారుల ఉత్తర్వుల కోసం రావాల్సి ఉందని మెమో దాఖలు చేశారు. కేసును ఎక్కువ రోజులు వాయిదా వేయలేమని ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టం చేసింది. విజయమ్మ, షర్మిళపై మాత్రమే కేసు ఉపసంహరించే ఉద్దేశం కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసును త్వరగా తేల్చాల్సి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నెల 31న విజయమ్మ, షర్మిళ సహా నిందితులందరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో కేసు వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ys sharmila ys vijayalakshmi case may be withdraw

ఇటు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ అంటూ హడావిడి చేస్తున్నారు. ఆమెతో ఒక్కొక్కరు చేరుతున్నారు కూడా. ఈ క్రమంలో కేసు విత్ డ్రా కావడం వారికి కలిసొచ్చే అంశమే.

English summary
ys sharmila ys vijayalakshmi case may be withdraw telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X