బోనమెత్తిన వైఎస్ షర్మిల: జై తెలంగాణ అంటూ: వైఎస్ జగన్ పాపులర్ డైలాగ్

హైదరాబాద్: ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజ అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయం ముందు బారులు తీరి నిల్చున్నారు. భక్తి ప్రపత్తులతో బోనాలను సమర్పించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మోరి అభిషేకంతో ఆషాఢమాసం బోనాల పూజ కార్యక్రమాలు మొదలయ్యాయి.

పాతబస్తీలో పండగ కళ..

పాతబస్తీలో పండగ కళ..

పాతబస్తీలోని లాల్ దర్వాజ బోనాలకు పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో మద్యం అమ్మకాలను నిషేధించారు. ఇదే చివరివారం బోనాలు కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తోన్నారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి..

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి..


దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మైనంపల్లి కుటుంబ సభ్యులు కూడా లాల్​ దర్వాజ బోనాల పండుగలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా కలిసి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. మధ్యాహ్నం వరకు లక్షమందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉంటారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

షట్లర్ పీవీ సింధు..

షట్లర్ పీవీ సింధు..

భక్తుల రాకపోకలతో పాతబస్తీలో పండగ వాతావరణం నెలకొంది. మేళతాళాలు, డప్పు చప్పుళ్లతో కోలాహలం నెలకొంది. రహదారులన్నీ క్రిక్కిరిసిపోయాయి. పలుచోట్ల ముస్లింలు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదయం స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రతి సంవత్సరం పాతబస్తీ లాల్ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు సింధు. బోనం సమర్పించడానికి వచ్చిన పీవీ సింధుకు ఆలయ కమిటీ సత్కరించింది.

 బోనమెత్తిన షర్మిల..

బోనమెత్తిన షర్మిల..

కాగా- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి భక్తి ప్రపత్తులతో బోనం సమర్పించారు. అనంతరం ఆమె భక్తులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు నిలువుటద్దమని వ్యాఖ్యానించారు. మహిళా శక్తికి, ఐక్యతకు బోనాలు నిదర్శనమని పేర్కొన్నారు.

అక్క చెల్లెమ్మ అంటూ..

అక్క చెల్లెమ్మ అంటూ..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ పలికే పదాలను ఉచ్ఛరించారు. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ, అన్నదమ్ములకు బోనాల శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తాను అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. ఇలాంటి ఉత్సవంలో తాను భాగస్వామి కావడం సంతోషాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. బోనాల పండగ ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీని అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+