తండ్రిబాటలో తనయ: కేసీఆర్ సర్కార్‌పై షర్మిల సెటైర్లు
సీఎం కేసీఆర్ ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా కూడా పలువ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్లలో షర్మిల పాదయాత్ర జరుగుతుంది. కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికే పాద్రయాత్ర చేపట్టానని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తానని..ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశిస్తాననీ.. ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మరోసారి వైఎస్ఆర్ నాయకత్వాన్ని తీసుకురావడమే తన లక్ష్యం అనీ.. ప్రతి ఇంటికి సంక్షేమాన్ని తీసుకువస్తామని చెప్పారు.

కుటుంబ సంక్షేమం
కేసీఆర్ రాష్ట్ర పాలన మానేసి కుటుంబ సంక్షేమాన్నే చూసుకుంటున్నారనీ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికి ఈ యాత్ర చేపట్టానని షర్మిల కామెంట్ చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన దొంగ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకుందని..రేవంత్ రెడ్డిలాగా మాకు బ్లాక్ మెయిల్ చేయటం చేతకాదని అన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తునే మరోపక్క బీజేపీపై కూడా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కులం, మతం పేరిట చిచ్చు పెడుతోందనీ..బీజేపీని గంగలో కలిపటానికే కూడా తన యాత్ర అని అన్నారు. టిఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ను చీల్చి చెండాడడానికేనంటూ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మోసం, నయవంచన
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదన్నారు. ఏడేళ్ళల్లో ప్రతి వర్గాన్ని మోసం చేస్తునే ఉన్నారని.. మోసాల పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా కేసీఆర్‌కు ఏమీ పట్టటం లేదని కేవలం కుటుంబం కోసమే పాటు పడుతున్నారంటూ వివమర్శలు సంధించారు. అద్వన్న సీఎం ఎవరంటే కేసీఆర్ అని ఓ సర్వే చెబుతుందని..పేదోళ్లకు కరోనా వస్తే గాంధీ ఆసుపత్రికి పొమ్మన్నారంటూ విరుచుపడ్డారు. రాష్ట్రంలో సమస్యలను, కష్టాలను నేరుగా తెలుసుకుని ప్రజల పక్షాన నిలుస్తాం.. నడుస్తాం.. పోరాడతామని ప్రకటించారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన ఉందా..? అంటే ఏమాత్రం లేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావటానికే నేను పార్టీని స్థాపించానని అన్నారు.

తండ్రి బాటలో
2003లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్ర, 2004, 2009లో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని దివంగత చేవెళ్ల నుంచే ప్రారంభించారు. సీఎం హోదాలో పలు సంక్షేమ పథకాలనూ ఇక్కడినుంచే ప్రారంభించారు. తండ్రి సెంటిమెంటు కోటలో షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. పాద్రయాత్ర సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి భారీగా జన సమీకరణ చేశారు. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications