ఐపీఎల్ అంటే అంత లోకువా: టోర్నీలో ఒక్క సిక్సూ కొట్టని మ్యాక్స్: కోహ్లీసేనపై సుడిగాలిలా
సిడ్నీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో దారుణంగా విఫలమైన ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌లో ఉండే ఆటగాడు.. గ్లెన్ మ్యాక్స్‌వెల్. బ్యాట్స్‌మెన్లు బౌలర్ల దిమ్మ తిరిగేలా, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడే మ్యాచులు అవి. సిక్సర్ల వర్షాన్ని కురిపించే వేదికలవి. అలాంటి చోట పించ్ హిట్టర్‌గా గుర్తింపు పొందిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. దారుణంగా తేలిపోయాడు. టోర్నమెంట్ మొత్తం విఫలం అయ్యాడు. ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా అతను బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. టోర్నమెంట్ మొత్తానికీ ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.

టీమిండియాపై సుడిగాలిలా..
మ్యాక్స్‌వెల్ పనైపోయిందంటూ అప్పట్లోనే ట్రోల్స్ చేశారు ఫ్యాన్స్. మెమెలతో ఓ ఆట ఆడుకున్నారతణ్ని. 10.50 కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టయిందంటూ ఎద్దేవా చేశారు. ఇక ఆస్ట్రేలియా జట్టులో కూడా స్థానం దక్కదని తేల్చేశారు కూడా. అలాంటి దారుణ విమర్శలను ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్.. బౌన్స్ బ్యాక్ అయ్యాడు. టీమిండియాపై చెలరేగిపోయి ఆడాడు. సుడిగాలి ఇన్నింగ్‌ను నమోదు చేశాడు. టీమిండియా బౌలర్లలో ఏ ఒక్కరినీ కనికరించలేదు. భారీ షాట్లు ఆడాడు. జట్టు 374 పరుగుల చేయడానికి తనవంతు కృషి చేశాడు.

19 బంతుల్లో.. 45
మిడిలార్డర్‌లో క్రీజ్‌లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తన అసలు సిసలు ఆటను ప్రదర్శించాడు. హార్డ్ హిట్టర్ అనే పేరును నిలుపుకొనేలా అతని బ్యాటింగ్ శైలి కొనసాగింది. 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయిదు ఫోర్లను కొట్టాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతోన్న మ్యాక్స్‌వెల్ ఐపీఎల్-2020లో మొత్తం 13 మ్యాచ్‌లను ఆడగా.. అందులో ఒక్క సిక్స్‌ను కూడా కొట్టలేదు. ఈ టోర్నమెంట్ మొత్తం కలిపి అతను చేసిన స్కోర్ 108. స్ట్రైక్‌రేట్ 101. టీమిండియా మీద మాత్రం కళ్లు తిరిగే స్ట్రైక్ రేట్‌ను అందుకున్నాడు. 236.84 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు.

తొలి మ్యాచ్‌లోనే రెండు సెంచరీలు..
భారత్‌తో సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆడిన తొలి మ్యాచ్‌లోనే రెండు సెంచరీలు నమోదు అయ్యాయి. కేప్టెన్ ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ శతకాలు బాది అవతల పడేశారు. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభించిన ఆరోన్ ఫించ్.. భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఖచ్చితమైన షాట్లను కొట్టాడు. 124 బంతుల్లో 114 పరుగులు చేశాడు. అతని కేరీర్‌లో ఇది అతని తొలి సెంచరీ. మరో బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఇక అచ్చంగా ఐపీఎల్ తరహాలో ఆడాడు. 66 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. వారిద్దరికీ గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్ తోడు కావడంతో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరును అందుకుంది. 350కి పైగా పరుగులను చేసిన ఏ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోలేదు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications