వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉద్యోగుల సెగ.. 1100 మంది పైలట్లు డ్యూటీ బంద్

|
Google Oneindia TeluguNews

ముంబయి : జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరోసారి ఉద్యోగుల సెగ తాకింది. 1100 మంది పైలట్లు విధులకు దూరంగా ఉండాలనుకోవడం ఆ సంస్థకు తలనొప్పిలా పరిణమించింది. దాదాపు మూడున్నర నెలల నుంచి జీతాలు లేవంటూ.. విధుల బహిష్కరణకు సిద్ధమయ్యారు పైలట్లు. సోమవారం (15.04.2019) ఉదయం 10 గంటల నుంచి నో డ్యూటీ అంటున్నారు సదరు 1100 మంది పైలట్లు. ఈ సంస్థలో 1600 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 70 శాతం మంది పైలట్లు విధులకు దూరంగా ఉంటామని ప్రకటించడం జెట్ ఎయిర్‌వేస్‌కు కష్టాలు తెచ్చిపెట్టనుంది.

ఫుట్‌బాల్‌ గ్రౌండంత రెక్కలు!.. 2 లక్షల కిలోల బరువు.. గాల్లోకి ఎగిరిన అతిపెద్ద విమానం (వీడియో)ఫుట్‌బాల్‌ గ్రౌండంత రెక్కలు!.. 2 లక్షల కిలోల బరువు.. గాల్లోకి ఎగిరిన అతిపెద్ద విమానం (వీడియో)

ఈ పదకొండు వందల మంది పైలట్లు నేషనల్‌ ఏవియేటర్‌ గిల్డ్‌ సభ్యులు. పైలట్లకే కాదు ఇతర విభాగాల సిబ్బందికి కూడా జీతాలు లేవట. జనవరి నుంచి ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బకాయిలు పెండింగులో ఉన్నాయంటున్నారు పైలట్లు. ఎప్పుడూ ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అందుకే విధులకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

1,100 Jet Airways pilots decide not to fly from Monday
English summary
Around 1,100 pilots belonging to crisis-hit Jet Airways’ pilots body National Aviator’s Guild (NAG) have decided not to fly from 10 am Monday in protest against “non-payment of salary dues”, a source said Sunday. The pilots along with engineers and senior management have not received salaries since January. The debt-ridden carrier has also not paid March salary to employees of other categories as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X