వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమర్నాథ్‌లో కుండపోత వర్షం, ఆకస్మిక వరదలు: పది మంది యాత్రికులు మృతి, సహాయక చర్యలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర గుహ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ భారీ వరదల్లో అనేక టెంట్లు కొట్టుకుపోవడంతో పది మంది యాత్రికులు మరణించారు. వేలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.

పవిత్ర గుహ సమీపంలో కొన్ని లంగర్లు, గుడారాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి. పది మంది యాత్రికులు మరణించారని అధికారులు తెలిపారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఎఫ్‌లచే రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం వాయుమార్గంలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.

 Five Dead After Cloudburst Near Amarnath Shrine Leads To Flash Floods, Rescue Operations Underway

వరదల నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, 3,880 మీటర్ల ఎత్తైన గుహ మందిరంలో 6,100 మందికి పైగా అమర్‌నాథ్ యాత్రికుల పదో బ్యాచ్ జమ్మూ నుంచి అనంతనాగ్‌లోని నున్వాన్-పహల్గామ్, గండేర్‌బల్‌లోని బల్తాల్ జంట బేస్ క్యాంపుల కోసం శుక్రవారం బయలుదేరింది.

వార్షిక 43 రోజుల యాత్ర జూన్ 30న ప్రారంభమైంది. ఇప్పటివరకు, గుహ మందిరంలో లక్ష మంది యాత్రికులు సందర్శించి ప్రార్థనలు చేశారు. ఆగస్టు 11న యాత్ర ముగియనుంది.

ప్రధాని మోడీ ఫోన్: అమిత్ షా సమీక్ష

అమర్నాథ్ యాత్రలో చోటుచేసుకున్న వరద బీభత్సంపై అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు ప్రధాని మోడీ. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు, హోంమంత్రి అమిత్ షా కూడా వరద పరిస్థితులపై సమీక్షించారు. అధికారులతో సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

English summary
Five Dead After Cloudburst Near Amarnath Shrine Leads To Flash Floods, Rescue Operations Underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X