డెహ్రాడూన్‌లో లోయలో పడ్డ బస్సు: 10 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో త్యూని ప్రాంతంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది మృతి చెందగా, 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఘటనపై ఉత్తరాఖండ్ గవర్నర్ కె.కె పాల్, ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయాలపాలయిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications