పదేళ్ళ బాలికకు కడుపులో రాళ్ళున్నాయని వెళ్తే బిడ్డ పుట్టింది
చంఢీగఢ్: దగ్గరి బంధువు చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన ఓ పదేళ్ళ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
కడుపులో రాళ్ళున్నాయని ఆపరేషన్ చేయాలని ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువస్తే గర్భవతిగా తేలింది. అయితే పదేళ్ళ వయస్సులోనే ఆ బాలికకు గర్భస్రావం చేసేందుకుగాను సుప్రీంకోర్టు గత నెల 28న, నిరాకరించింది.
దీంతో చంఢీఘడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యుల బృందం ఆ బాలికకు ఆపరేషన్ చేశారు. ముగ్గురు గైనకాలజిస్టులు, నియోనటాలజిస్టు, పిడియాట్రిషియన్ వైద్య బృందంలో ఉన్నారని బాలిక ఆరోగ్య పర్యవేక్షణ కోసం నియమించిన కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి హరీష్ తెలిపారు.

ఇది అసాధారణ గర్భమైనా సిజేరియన్ సజావుగా సాగిందని, శిశువు బరువు తక్కువగా ఉండడంతో ఐసీయూలోనే ఉంచినట్టు వైద్యులు చెప్పారు. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు.
వైద్య ఖర్చులను ఛండీఘడ్ పాలనయంత్రాంగం భరిస్తోంది. భాలిక భవిష్యత్తు దృష్ట్యా బిడ్డను దత్తత ఇవ్వాలని ఆమె తండ్రి ఆసుపత్రి వర్గాలను కోరారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications