వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 100రోజుల పాలనపై కాంగ్రెస్ యుద్దభేరి(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢల్లీ: మే 26వ తేదీన దేశ 14వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ప్రధానిగా సెప్టెంబర్ 2 (మంగళవారం)తో 100రోజులను పూర్తి చేసుకున్నారు. దేశంలో ఎన్‌డీఎ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు, అబధ్దాలను చెప్పి ప్రజలను మోసగించి అధికారం చేజిక్కుందని కాంగ్రెస్ పార్టీకి ఆరోపించింది. నరేంద్ర మోడీ 100రోజుల పాలనపై కాంగ్రెస్ '#100DaysIndiaPays'తో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

అధికారంలోకి వచ్చి 100రోజులు గడిచినా ప్రజలు నరేంద్ర మోడీ పాలనపై నిరాశతో ఉన్నారు. 100 రోజుల ఆయన పాలనలో చెప్పింది ఎక్కువ...చేసింది తక్కువ అని పేర్కొంది. ధరల పెరుగుదలను నియంత్రించడం, ఆడవారిపై అత్యాచారాలు నివారించడంలో విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

నల్లధనం విషయంలో ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఆయన బిజెపి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రు. 85 లక్షల కోట్ల మొత్తం నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని హామీనిచ్చారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తవుతున్నా ఇంకా కనీసం 85 పైసలు కూడా వెనక్కి రాలేదని ఎద్దేవా చేశారు.

నియంత్రణా రేఖ వద్ద ఉల్లంఘనలు, పాక్‌ ప్రధానికి దౌత్యపరమైన ఆహ్వానంపై ఈ పార్టీ, ఈ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో నాయకత్వాన్ని తప్పుపట్టారని గుర్తు చేసిన ఆయన పాకిస్తాన్‌ విషయంలో ఈ ప్రభుత్వానికి ఖచ్చితత్వం, స్పష్టత లోపించాయని ఆరోపించారు. తమ విదేశాంగ విధానంలో పరిణితిని ప్రదర్శించలేకపోయారని అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్ఎస్‌‌కు కార్యకర్తలు మతోన్మాదంపై ఇప్పటికే దేశంలో పలు అసహ్య ప్రసంగాలు చేశారు.

మోడీ 100రోజుల పాలనపై సీఎన్ఎన్ - ఐబీఎన్ టుడేస్ చాణక్య సర్వేలో మోడీ ధరల పెరుగుదలను సమర్దవంతంగా అడ్డుకుందని 31 శాతం మంది చెప్పగా... 27 శాతం మంది పరిస్దితి ఆర్దిక పరిస్దితి మరింతగా దిగజారిందని పెదవి విరిచారు.

మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రుల సెక్రటరీలను నియమించుకునే విషయంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్రమంత్రులు వారంతటవారే సెక్రటరీలను నియమించకోవడానికి వీల్లేదన్నారు.

మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

దేశంలో వివిధ నగరాల్లో 100 రోజుల్లో 600కుపైగా అల్లర్లు జరిగాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఈ అల్లర్లు మరింతగా ఎక్కువయ్యాయి. పూణెలో ముస్లిం సాప్ట్ వేర్ ఇంజనీర్‌ను హిందువులు చంపివేశారు.

 మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

ముజాఫనగర్‌లో అల్లర్లు వెనుక ముఖ్యభూమికను పోషించిన సంజీవ్ బాలియన్‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి నరేంద్ర మోడీ తీసుకున్నారు. ఇదే ముజాఫనగర్‌ అల్లర్లులో ముద్దాయిగా ఉన్న సంగీత్ సోమ్‌కు జడ్ కేటగిరి భద్రతను కల్పించారు.

మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

ఉత్తర ప్రదేశ్ బిజెపి ఛీప్‌గా యోగి ఆదిత్యను నియమించారు. అస్సాంలో బిజెపి ఎంపీలు మత హింసను ప్రోత్సహించారు.

 మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

కేంద్ర ప్రభుత్వంలో మానవ వనరుల మంత్రిగా ఉన్న స్మితీ ఇరానీ ఎడ్యుకేషన్‌లోకి హిందుత్వను తీసుకొచ్చారు. భారత్‌లో ఉన్న ఎడ్యుకేషన్‌పై ఎర్ఎస్ఎస్ భావాలను రుద్దేందుకు స్మితీ ఇరానీ ప్రయత్నించారు.

మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

హిందూత్వవాదిగా ముద్రపడ్డ వై సుదర్శన రానుని నరేంద్రమోడీ హిస్టారికల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ కి ఛైర్మన్‌గా నియమించారు. కేంద్ర మంత్రి జితేంద్ర ఆర్టికల్ 370 గురించి మళ్లీ ఆలోచించాలన్నారు.

మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

ఆర్మీ ఛీప్‌గా భాద్యతలు నిర్వహించిన వికె సింగ్ కొత్త ఆర్మీ ఛీప్‌పై బాద్యతారాహిత్యమైన ట్వీట్స్ చేశారు.

మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

భారతీయులందరూ హిందువులంటూ నజ్మా హెప్తుల్లా యావత్ భారతదేశం ఆశ్చర్యపడేలా మాట్లాడారు. ఆ తర్వతా హిందువులు కాదు... హిందీ'స్ అన్నారు.

 మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

ఇండియా టూరిజం ఆదాయంపై నిర్బయ రేప్ ఎలాంటి ప్రభావం చూపదని.. అదోక చిన్న రేప్ మాత్రమేనని కేంద్ర ఆర్దక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు చేశారు.

 మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హార్షవర్దన్ ఎయిడ్స్‌ను నిరోధించడానికి కండోమ్స్ కంటే విలువలు మఖ్యమన్నారు. పాఠశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ని ఆపివేయాలని చూసించారు.

 మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

అంతర్జాతీయ బోర్డర్‌లో పాకిస్ధాన్ ఫోర్సెస్ కాల్పుల విరమణను మరిచి భారత్ సైనికులపై కాల్పులు జరిగింది. బీఎస్ఎఫ్ అందించిన సమాచారం ప్రకారం 1971 యుద్దం తర్వాత పాకిస్దాన్ చేసిన అతి పెద్ద కాల్పులు మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగడం విశేషం.

మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అధికా దుర్వినియోగానికి పాల్పడ్డారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణ లో ప్రభుత్వం విఫలమయింది.

 మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

ఏ మాత్రం అదుపులోకి రాని నిత్యావసరాల ధరలకు దేశంలోని చాలా ప్రాంతాల్లో నెలకొని ఉన్న వర్షాభావ పరిస్థితులు తోడయ్యాయి. ప్రభుత్వాల గెలుపోటములు నిర్ణయించడంతో సైతం ప్రభావం చూపే ఉల్లి ధర పెరుగుదల ప్రభుత్వానికి ఆందోళన కారణమయింది.

 మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

ధరల పెరుగుదలతో పాటు ప్రభుత్వానికి ఆందోళన కలిగించిన అంశం ప్రాధాన్యతల విషయంలో సవ్యంగా వ్యవహరించలేదు.

మోడీ 100రోజుల పాలన

మోడీ 100రోజుల పాలన

గతంలో ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ జడ్జిని గవర్నర్‌గా నియమించింది. సుప్రిం కోర్టు మాజీ జడ్టి జస్టిస్ సదాశివాన్ని కేరళ గవర్నర్‌గా నియమించారు.

English summary
In less than 48 hours, the Modi led BJP Government will complete its 100 days of office. The BJP captured power by making lofty promises and selling unrealistic dreams. The 100 days story of this Government has proved to be disappointing, non-fulfilment of promises and subverting
 institutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X