వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kidnap:38 మంది గిరిజన మహిళలు కిడ్నాప్...ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

బైకులు దొంగతనం చేస్తున్నారన్న అనుమానంతో రాజస్థాన్‌కు చెందిన 38 మంది గిరిజన మహిళలు పిల్లలను మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన 100 మంది కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీసులు ఈ 38 మందిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించడంలో సఫలీకృతులయ్యారు. కిడ్నాప్ జరిగిన ఆరుగంటల్లోనే కిడ్నాపర్ల జాడను తెలుసుకుని అందులో ఆరుగురుని పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రి కిడ్నాప్‌కు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్ మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో కంజార్ గిరిజన వర్గానికి చెందిన వారు అక్కడే టెంట్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరందరికీ ఆ ప్రాంతంలో జరుగుతున్న పలు నేరాలతో సంబంధం ఉందని అక్కడి స్థానికులు బలంగా నమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని కలాసియా గ్రామంలో ఓ బైకు చోరీ కావడం, వీరిపై అనుమానం రావడంతో అక్కడ ఉన్నవారందరినీ సామూహిక కిడ్నాప్‌ చేశారని పోలీసులు తెలిపారు. బైకు చోరీకి గురైందని తెలియగానే కలాసియా గ్రామస్తులు తుపాకులు, ఐరాన్ రాడ్లు, లాఠీలు తీసుకుని సరిహద్దులోని రాజస్థాన్ గ్రామంలోకి వెళ్లి అక్కడ బస్సుల్లో, కార్లలో, తలదాచుకున్న వారిదగ్గరకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు.

100 people of MadhyaPradesh kidnap 38 tribal people from Rajasthan over bike theft

అక్కడ మగవారు ఉన్నారేమో అని వారే తమ బైకులను చోరీ చేస్తున్నారన్న అనుమానంతో వారికోసం అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ మగవారు ఎవరూ లేకపోవడంతో 10మంది మహిళలను 20 మంది మైనర్ అమ్మాయిలను, 8 మంది చిన్నపిల్లలను బస్సులో వేసుకుని మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించారని పోలీసులు వివరించారు. విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బస్సును వెంబడించారు. పోలీసులు తమను వెంబడిస్తున్నారని గ్రహించిన కిడ్నాపర్లు మహిళలను పిల్లలను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. కిడ్నాపర్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

ఇక ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి దేశీయ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఐరన్ రాడ్లు, ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కిడ్నాప్ చేసేందుకు వినియోగించిన బస్సు కలాసియా గ్రామ సర్పంచ్‌దిగా పోలీసులు గుర్తించారు.ఈ మొత్తం ఆపరేషన్ అడిషనల్ ఎస్పీ రాజేష్ యాదవ్, డిప్యూటీ ఎస్పీ బ్రిజ్‌మోహన్ మీనా నేతృత్వంలో జరిగింది. మరో 94 మందిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

English summary
In a brazen case of mass kidnapping, a group of over 100 people belonging to a Madhya Pradesh village abducted 38 tribal women and children from Rajasthan on suspicion that their men were involved in stealing their bikes, police said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X