వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్.. ఓకేసారి 1000 మంది వీడియో కాల్.. టెలీగ్రామ్ నయా ఫీచర్

|
Google Oneindia TeluguNews

టెక్‌ ప‍్రపంచంలో యూజర్లను ఆకట్టుకోవడమే పని.. అందుకోసమే కంపెనీలు పనిచేస్తాయి. ఆఫర్లు, వెర్షన్లు ఎప్పటికప్పుడు కొత్తగా ప్రవేశపెడతాయి. ఆ జాబితాలో చాలా ఉన్నాయి. ప్రముఖ మెసేజింగ్‌ సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. టెలిగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ తెచ్చింది. ఈ అప్‌డేట్‌తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్‌ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రైవసీ పాలసీ వల్ల..

ప్రైవసీ పాలసీ వల్ల..

ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా యూజర్లు వాట్సాప్‌కు దూరం అవుతున్నారు. ప్రత్యామ్నయంగా టెలిగ్రామ్‌ యాప్‌ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాన్నారు. దీంతో టెలిగ్రాం వాట్సాప్‌తో పోటీ పడడంతోపాటు యూజర్లను ఆకట్టుకునేలా కొత్త కొత్త అప్‌డేట్‌లతో దూసుకుపోతుంది. ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతోపాటు వీడియోలను షేర్‌ చేసేలా ఫీచర్‌ను అప్‌డేట్‌ చేసింది.

1000 మంది వీడియో కాల్

1000 మంది వీడియో కాల్

యూజర్లు ఒకే సారి గ్రూప్‌కాల్‌లో యాడ్‌ అయ్యే వరకు పరిమితిని పెంచుతూనే ఉండాలని టెలిగ్రామ్‌ తెలిపింది. 1000 మంది వీడియో కాల్ మాట్లాడుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్‌ వల్ల ఆన్‌లైన్ క్లాసులు, మీటింగ్స్‌లో పాల్గొనే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టెలిగ్రామ్ తన వీడియో షేరింగ్‌ ఫీచర్‌ని అప్‌డేట్ చేసింది. మీరు మీ చాట్ బాక్స్‌లోని రికార్డింగ్ బటన్‌ని ట్యాప్‌ చేస్తే వీడియో రికార్డ్‌ అవుతుంది. ఆ రికార‍్డైన వీడియోలను మీ స‍్నేహితులకు షేర్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

నయా ఫీచర్స్..

నయా ఫీచర్స్..

సో.. టెలీగ్రామ్.. నయా ఫీచర్, యూజర్లను అమితంగా ఆకట్టుకొనుంది. ఇప్పటివరకు ఉన్న యూజర్లతోపాటు మరింత మంది వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న వాట్సాప్ హవా క్రమంగా తగ్గిపోనుంది. వాస్తవానికి టెలీగ్రామ్.. వాడాలని.. దేశీ పేరుతో ఎప్పటినుంచే మేసేజ్ ఫార్వార్డ్ అవుతూ వస్తున్నాయి. కొత్త కొత్త అప్ డేట్ వల్ల టెలీ గ్రామ్ వాట్సాప్‌ను ఢీ కొనే స్థాయికి ఎదుగుతుంది.

పై పైకి..

పై పైకి..

ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ యూజర్లు ఎక్కువగా వాడుతుంటారు. టెలి గ్రామ్ కూడా యూజ్ చేసినా.. అంత స్థాయిలో ఉండేది కాదు. కానీ కొత్తగా సాప్ట్ వేర్ అప్ డేట్ వల్ల మేసెంజర్‌కు కలిసి వస్తోంది. తన వినియోగదారులను కంపెనీ పెంచుకుంటూ వస్తోంది.

English summary
telegram aap will now let 1000 people join video call at a time. telegram messenger new update is came.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X