మదురై చెత్తకుప్పలో నాటుబాంబుల కుప్ప సీజ్

చెత్త వేయడానికి సోమవారం నాలుగు గంటల ప్రాంతంలో వచ్చిన ఓ మహిళకు ఎర్ర రంగు సంచీ కనిపించింది. ఆమె దాన్ని తెరిచి చూడగా, అందులో బాంబులు కనిపించాయి. ఆమె అప్రమత్తం చేయడంతో నగర పోలీసులు అక్కడికి చేరుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
నాటుబాంబులు కోడిగుడ్డు ఆకారంలోనూ సిలిండర్ ఆకారంలోనూ ఉన్నాయి. వాటిని తాళ్లతో బిగించి కట్టారు. డిప్యూటీ పోలీసు కమిషనర్ సామంత్ రోహన్ రాజేంద్ర నేతృత్పంలోని పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. వాటిని చెత్తకుప్పలో ఎవరు పెట్టారనే విషయంపై పోలీసులకు ఏ విధమైన ఆధారాలు లభించలేదు.
ఆ ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేసి, విచారణ చేపట్టారు. భయాందోళనలు సృష్టించడానికే ఈ పనికి పూనుకున్నారని పోలీసులు చెప్పినట్లు ఓ టీవీ చానెల్ వార్తను ప్రసారం చేసింది. ఇందులో స్థానిక రౌడీ ముఠా హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications