Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ గంటకు ఛార్జ్ చేసేది ఎన్ని కోట్లో తెలుసా ? తొలిసారి..!

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే విజయం, మోడీ ప్రధాని కావడంతో తొలిసారి రాజకీయ వ్యూహకర్తగా అందరికీ పరిచయమైన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత వైఎస్ జగన్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీతో పాటు పలువురు రాజకీయ నేతలకు అధికారాన్ని అందించారు. అయితే తన రాజకీయ వ్యూహాలతో వీరిని అధికారంలోకి తెచ్చేందుకు తాను ఎంత తీసుకున్నాననేది మాత్రం ఆయన ఎప్పుడూ బయటపెట్టలేదు. దీంతో ఎవరికి వారు ఆయన ఫీజుపై లెక్కలు వేసుకున్నారు.

అయితే తొలిసారి ఇవాళ ప్రశాంత్ కిషోర్ తాను రాజకీయ వ్యూహాలు అందించినందుకు రాజకీయ పార్టీల నుంచి ఎంత భారీ మొత్తంలో ఫీజు తీసుకుంటారో బహిరంగంగా వెల్లడించారు. కొంతకాలంగా రాజకీయ వ్యూహాలకు బ్రేక్ ఇచ్చేసి బీహార్ లో జన్ సురాజ్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చేందుకు రెండు గంటలకు 11 కోట్ల ఫీజు వసూలు చేస్తానని వెల్లడించారు. అంటే గంటకు 5.5 కోట్లు అన్న మాట.

11 Crore for Two Hours Prashant Kishor s Staggering Consulting Fee

బీహార్ ఎన్నికల్లో తన జన్ సురాజ్ పార్టీకి షెల్ కంపెనీల నుంచి నిధులు అందుతున్నాయన్న విమర్శలపై ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. తాను రెండు గంటలు సలహాలు ఇచ్చి 11 కోట్లు తీసుకున్నానని, అదీ ఈ బీహార్ కుర్రాడి సత్తా అన్నారు. తన వృత్తిపరమైన సేవలకు వచ్చిన ఫీజుకు జీఎస్టీ, ఐటీ చెల్లించి మరీ తన పార్టీకి ఇచ్చినట్లు పీకే వెల్లడించారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని ఆయన తేల్చిచెప్పేశారు. ఇప్పటికే పీకే పార్టీని కాంగ్రెస్-ఆర్జేడీ కూటమితో పాటు అధికార బీజేపీ-జేడీయూ కూటమి కూడా టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తనకు వచ్చిన నిధులపై వివరణ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+