ఆస్తుల వివరాలు యూఏఐడిఏఐకు తెలియవు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆధార్ కు సంబంధించిన డేటా బహిరంగ మార్కెట్లోకి సులభంగా దొరుకుతోందనే వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆధార్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణను బుధవారం నాడు ప్రారంభించింది. దీంతో ఆధార్‌పై సామాన్యుల సందేహలను నివృత్తి చేసేందుకు యూఐడిఏఐ ప్రయత్నాలను ప్రారంభించింది. సుమారు 11 ప్రశ్నలు, వాటికి సమాధానాలను విడుదల చేసింది యూఏఐడిఏఐ.

సంక్షేమ పథకాలతో పాటు అనేక విషయాలకు ఆధార్‌ను ప్రభుత్వాలు లింక్ చేశాయి. అయితే ఆధార్‌ సమాచారాన్ని ప్రతి విషయానికి లింక్ చేయడం ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంటుందని వాదనలు కూడ లేకపోలేదు.

అయితే ఈ తరుణంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆధార్‌పై బుదవారం నుండి వాదనలను ప్రారంభించింది. ఈ వాదనలకు సంబంధించిన సమయంలోనే ఆధార్‌పై అనుమానాలపై సాధారణ సందేహలు, సమాధానాలను యూఏఐడిఏఐ విడుదలు చేయడం గమనార్హం.

 ఆస్తుల వివరాలు యూఐడిఏఐ వద్ద ఉండవు

ఆస్తుల వివరాలు యూఐడిఏఐ వద్ద ఉండవు

బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు, పాన్, మ్యూచ్‌వల్‌ ఫండ్లలో పెట్టుబడులు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీల వివరాలు ఉండవని యూఐడీఏఐ దగ్గర తేల్చి చెప్పింది. కుటుంబ సభ్యులు, కులం తదితర వివరాలేవీ ఉండవని కూడ ప్రకటించింది.

బ్యాంకు ఖాతాల నుండే ఇతరులు డబ్బులు డ్రా చేయకుండా ఉండేందుకు

బ్యాంకు ఖాతాల నుండే ఇతరులు డబ్బులు డ్రా చేయకుండా ఉండేందుకు

నేరస్తులు, అవినీతిపరుల బ్యాంకు ఖాతాలను తొలగించేందుకు గాను బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానించినట్టు యూఐడీఏఐ ప్రకటించింది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న ఖాతాల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బు తీస్తే వారి గురించి ఆ వివరాలు బయటకు వస్తాయి.. దీంతో ఆధార్‌తో అనుసంధానం చేసిన ఖాతాలకు మరింత భద్రత చేకూరనున్నట్టు చెప్పారు.

సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం ఇందుకే

సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం ఇందుకే

ఆధార్‌ సంఖ్య వచ్చే వరకు ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగానే సంక్షేమ పథకాల ప్రయోజనాలు కల్పించాల్సిందేనని చట్టంలో స్పష్టంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వ సిబ్బంది ఎవరైనా ఆధార్‌ కచ్చితంగా కావాల్సిందేనని ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారిపై పై అధికారులకు ఫిర్యాదు చేయండి.సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే దీనికి ఆధార్‌ను అనుసంధానం చేసినట్టు ప్రకటించింది యూఐడీఏఐ .

ఈ ఆధార్ ను ఒప్పుకోకపోతే ఫిర్యాదు చేయొచ్చు

ఈ ఆధార్ ను ఒప్పుకోకపోతే ఫిర్యాదు చేయొచ్చు

ఈ-ఆధార్‌ కూడా ఒరిజినల్‌ ఆధార్‌తో సమానమే. రెండింటిలో ఏదైనా ఒకటే. అన్ని సంస్థలూ రెండింటిలో దేన్నయినా అంగీకరించాల్సిందే. ఒరిజినల్‌ ఆధార్‌ కన్నా ఈ-ఆధార్‌కే వారు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా ఈ-ఆధార్‌ను ఒప్పుకోకపోతే వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని యూఐడీఏఐ .స్పష్టం చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After a recent report exposed how access to the Aadhaar database could be bought on the internet only for Rs 500, a lot of concerns were expressed over the security of private data of citizens on the government portal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X