'షో' అంటే ఇదీ.. : గోల్డెన్ బాబా..! మజాకా..!

Subscribe to Oneindia Telugu

ఉత్తరప్రదేశ్ : 'బాబా'ల క్రేజ్ కు కేరాఫ్ ఈ గోల్డెన్ బాబా. బాబాలంటే గుర్తొకొచ్చే నిరాడంబరతకు ఈ గోల్డెన్ బాబా పక్కా రివర్స్. 'చుట్టూ వందల మంది అనుచరులు.. ఒంటినిండా బంగారం ధగధగలు.. తుపాకులు పట్టుకున్న పోలీసు పహారా నడుమ.. లగ్జరీ కార్ల టాప్ పై కూర్చొని దర్జా యాత్రలు..' సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ గురించి చెప్పినట్లు ప్రస్తుతం ఈ గోల్డెన్ బాబా గురించి కూడా అదే తరహాలో చర్చించుకుంటున్నారు జనం.

12.5kg of jewellery on him, ‘Golden Baba

హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకు.. 24వ సారి కన్వారియా యాత్రను చేపట్టిన మీరట్ గోల్డెన్ బాబా ఒంటిమీద 4కోట్ల విలువైన 12 కేజీల బంగారాన్ని ధరించి ఫార్చ్యూన్ వాహనంపై ఊరేగారు. ఇక గతేడాది ఇదే యాత్ర కోసం రూ.72లక్షలు ఖర్చు చేసిన ఈ గోల్డెన్ బాబా ఈసారి కోటి మార్క్ ను అందుకున్నారు. యాత్రలో హంగామా విషయానికొస్తే..! 'ఆయన వెంట ఓ 200 మంది జనం, 10 మంది అంగరక్షకులు, కారు టాప్ పై కూర్చున్నప్పుడు చుట్టూ రక్షణగా తుపాకులు పట్టుకున్న పోలీసులు..' ఇదీ ఆయన యాత్రలు సాగే తీరు.

భగవంతుడు తనకు సంపదను ఇస్తున్నాడు అని చెప్పుకునే ఈ గోల్డెన్ బాబా ఒంటిపై ప్రతీ ఏటా బంగారు ఆభరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదంతా లక్ష్మీదేవీ కరుణ కటాక్షమని తన గోల్డెన్ ప్రస్తానం గురించి చెబుతారు బాబా.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Almost every kanwaria en route to Haridwar these days has heard of 'Golden Baba' and wants to have his darshan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి