ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం, 150 అడుగుల లోయలో పడిన బస్సు: 12 మంది మృతి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 12 మంది వరకు మృతి చెందారు. మరో పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర కాశీ - యమునోత్రి హైవేలో చోటు చేసుకుంది. ఓ బస్సు150 అడుగుల లోయలో పడింది.

విషయం తెలియగానే పోలీసులు, సహాయక బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు అదుపుతప్పి లోయలో పడింది.

12 killed, 13 hurt as bus falls down 150 metre gorge in Uttarakhand

అది ఓ ప్రయివేటు బస్సు అని, వికాస్‌ నగర్‌ నుంచి జంకిచట్టికి వెళ్తోందని, మధ్యలో దంతా వద్ద లోయలో పడిందని ఉత్తరకాశి జిల్లా మెజిస్ట్రేట్‌ అశిష్‌ చైహాన్‌ చెప్పారు.

ప్రమాదం కారణంగా పదిమంది అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారని చెప్పారు. ఈ ప్రమాదంలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హెలికాప్టర్‌లో డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+