భారీ ఎన్‌కౌంటర్: 12మంది మావోయిస్టులు మృతి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పలమవు జిల్లాలోని సత్‌బర్వ పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్థరాత్రి 2.30గంటల సమయంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
కాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఘటనాస్థలిలో లభ్యమైన అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ రాజధానికి 140 కిలో మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

సత్‌బర్వ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రహస్య ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలుసుకున్న భద్రతాబలగాలు వారిని చుట్టుముట్టాయి. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో, భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయని అధికారులు వెల్లడించారు.
గాయపడిన భద్రతా సిబ్బందిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పలమవు జిల్లాలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications