ఎన్నికల వేళ మరో భారీ ఎన్‌కౌంటర్: 12 మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ (Bijapur) జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. దీంతో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజాగా ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

ఘటనా స్థలం నుంచి ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. స్థానికంగా గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
కాగా, ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం విధితమే. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఏప్రిల్ 30న నారాయణ్ పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మరో ఎదురుకాల్పుల ఘటనలో 10 మంది మరణించారు.












Click it and Unblock the Notifications