Karnataka Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీవాసుల మృతి..
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్ లో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్ లో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది మృతి చెందారు..!! pic.twitter.com/0azIrPLMSM
— oneindiatelugu (@oneindiatelugu) October 26, 2023
టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. ప్రమాదానికి గురైన వాహనంపై ఏపీకి చెందిన నంబర్ ప్లేట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీగా మంచు ఉండడంతో రోడ్డు ముందు వాహనాలు కనిపించే లేదు. ఈ క్రమంలోనే ఆగి ఉన్న ట్యాంకర్ కనిపించక.. టాటా సుమో ట్యాంకర్ ను ఢీకొట్టింది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటి వరకు మృతుల వివరాలు తెలియరాలేదు.

దసరా పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన వారంతా బెంగళూరులో కూలి పనులకు వెళ్లే కూలీలుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓడిస్సాకు చెందిన భార్యాభర్తలు వెంకటనారాయణ, సుబ్బమ్మ ఉన్నారని తెలుస్తోంది.
ప్రాణం తీసిన మంచు.. లారీని ఢీకొన్న టాటా సుమో..!! pic.twitter.com/s3Qa8iEUzw
— oneindiatelugu (@oneindiatelugu) October 26, 2023












Click it and Unblock the Notifications