వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ముందుకు ఉరిశిక్ష పడిన షబ్నమ్ క్షమాభిక్ష పిటీషన్ .. తల్లి మరణశిక్ష రద్దుకు కొడుకు వేడుకోలు

|
Google Oneindia TeluguNews

స్వతంత్ర్య భారతదేశంలో ఉరిశిక్ష పడిన మొట్టమొదటి మహిళను ఉరి తీయడానికి ఉత్తరప్రదేశ్లోని మధుర జైల్లో ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఆమె ఉరిశిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వద్దకు క్షమాభిక్ష పిటిషన్ చేరింది. ప్రియుడితో కలిసి తన కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చిన ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళ షబ్నమ్ కుమారుడు తన తల్లి చేసిన నేరాలను క్షమించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

 స్వతంత్ర్య భారతదేశంలో ఉరి తీయబడుతున్న మొట్టమొదటి మహిళ .. ఆమె భయంకర నేర చరిత్ర ఇదే !! స్వతంత్ర్య భారతదేశంలో ఉరి తీయబడుతున్న మొట్టమొదటి మహిళ .. ఆమె భయంకర నేర చరిత్ర ఇదే !!

 షబ్నమ్ కుమారుడు మహ్మద్ తాజ్ తన తల్లి మరణశిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతికి వినతి

షబ్నమ్ కుమారుడు మహ్మద్ తాజ్ తన తల్లి మరణశిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతికి వినతి

2008లో ప్రియుడితో కలిసి చిన్న పిల్లలని కూడా కనికరం లేకుండా ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులను గొడ్డలితో నరికి హతమార్చింది. ఈ కేసులో షబ్నమ్ కు, ఆమె ప్రియుడికి కోర్టు ఉరి శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమెకు ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె 12 ఏళ్ల కుమారుడు మహ్మద్ తాజ్ తన తల్లి మరణశిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మహ్మద్ తాజ్ చేసిన విజ్ఞప్తిలో నేను నా తల్లిని ప్రేమిస్తున్నాను, రాష్ట్రపతి మామ కోసం నాకు ఒకే ఒక డిమాండ్ ఉంది, ఆయన నా తల్లిని ఉరి తీయనివ్వడు. క్షమిస్తారని అని తాజ్ విలేకరులతో అన్నారు.

 క్షమాపణ కోరుతూ వ్రాతపూర్వక అభ్యర్థన .. తల్లి జ్ఞాపకాలను పంచుకున్న తాజ్

క్షమాపణ కోరుతూ వ్రాతపూర్వక అభ్యర్థన .. తల్లి జ్ఞాపకాలను పంచుకున్న తాజ్

కుర్చీపై నిలబడి, తన తల్లికి "క్షమాపణ" కోరుతూ వ్రాతపూర్వక అభ్యర్థనతో స్లేట్ పట్టుకున్నాడు. ఆమెను క్షమించాల్సిన బాధ్యత రాష్ట్రపతి పై ఉంది. నాకు నమ్మకం ఉంది అని మహ్మద్ తాజ్ చెప్పారు .

తాజ్ తన పెంపుడు తల్లిదండ్రులు ఉస్మాన్ సైఫీ అనే జర్నలిస్టుతో కలిసి నివసిస్తున్నారు, అతను షబ్నమ్ కేసు విషయంలో అతనితో పాటు తనను కూడా జైలుకు తీసుకువెళ్తాడని మహ్మద్ తాజ్ చెప్పాడు . తాను వెళ్ళినప్పుడల్లా, తన తల్లి తనను కౌగిలించుకుని, ఎలా ఉన్నావ్ కొడుకా అను అడుగుతుందని చెప్పారు . నువ్వు ఏమి చేస్తున్నారు? నీ పాఠశాల ఎప్పుడు ప్రారంభమవుతుంది? నీ చదువు ఎలా సాగుతుంది ? నువ్వు మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తుందని తల్లి మాటలు గుర్తు చేసుకున్నారు తాజ్ .

తల్లి ఏం నేరం చేసినా పిల్లవాడు నేరస్తుడు కాదన్న పెంపుడు తండ్రి ఉస్మాన్ సైఫీ

తల్లి ఏం నేరం చేసినా పిల్లవాడు నేరస్తుడు కాదన్న పెంపుడు తండ్రి ఉస్మాన్ సైఫీ


ఉస్మాన్ సైఫీ మాట్లాడుతూ అతనికి మంచి విద్యను అందించడానికి, అతన్ని మంచి మనిషిగా మార్చడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. అతని తల్లి ఏ నేరానికి పాల్పడినప్పటికీ, పిల్లవాడు నేరస్థుడు కాదని చెప్పారు . అతని తల్లిని ఉరి తీస్తే నేరానికి శిక్ష పిల్లవాడికి పడినట్టు అవుతుందని అన్నారు .

రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాలోని ఒక న్యాయస్థానం షబ్నమ్ ఉరి తీయడానికి తేదీ మరియు సమయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. మధురలోని ఒక జైలు, దేశంలో మహిళలకు ఉరిశిక్ష గది ఉన్న ఏకైక జైలు అక్కడ ఉరి తీయడానికి సర్వం సిద్ధమవుతోంది.

 జైల్లోనే జన్మించిన మహ్మద్ తాజ్ .. క్షమాభిక్ష పెట్టమని అడుగుతున్న కొడుకు

జైల్లోనే జన్మించిన మహ్మద్ తాజ్ .. క్షమాభిక్ష పెట్టమని అడుగుతున్న కొడుకు

14 ఏప్రిల్ 2008 న ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరులు, బావ మరియు 10 నెలల మేనల్లుడుతో సహా ఆమె కుటుంబంలోని ఏడుగురిని హతమార్చినందుకు షబ్నమ్ మరియు ఆమె ప్రేమికుడు సలీం లను దోషులుగా నిర్ధారించారు. దోషిగా తేలినప్పుడు షబ్నమ్ గర్భవతి. మహ్మద్ తాజ్ జైల్లోనే జన్మించారు . జైల్లో జన్మించిన పిల్లలు ఆరు సంవత్సరాలు దాటి జైలులో ఉంచకూడదు. జైలు నిబంధనల ప్రకారం షబ్నమ్ కుమారుడిని తనకు దగ్గర స్నేహితుడైన వ్యక్తికి అప్పగించింది . ఇప్పుడు ఆ బాబే తన తల్లిని క్షమించమని రాష్ట్రపతిని అభ్యర్థిస్తున్నారు .

English summary
A prison in Uttar Pradesh is preparing for what could be the first-ever hanging of a woman convict in independent India. Shabnam Ali was sentenced to death for killing seven members of her family, including a baby, in 2008. Her 12-year-old son, Mohammed Taj, has appealed to President Ram Nath Kovind to commute her death sentence. I love my mother. I have only one demand for President uncle, that he doesn't let my mother be hanged, Taj told reporters .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X