Covid Vaccine For 124 Year Old woman In Kashmir: ప్రపంచంలోనే అత్యంత వృద్ద మహిళ...?

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో 124 ఏళ్ల ఓ వృద్దురాలు బుధవారం(జూన్ 2) కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ వృద్దురాలి పేరు రెహ్తీ బేగమ్ అని... శ్రాక్‌వారా బ్లాక్‌ నివాసి అని తెలిపారు. అయితే ఆమె వయసుకు సంబంధించిన ప్రూఫ్ ఏదీ వారు చూపించలేకపోయారు. కొడుకు రేషన్ కార్డుపై ఉన్న ఆమె పుట్టిన తేదీ ఆధారంగా ఆమెకు 124 ఏళ్లు అని వెల్లడించారు.ఒకవేళ ఆమె వయసు నిజంగానే 124 ఏళ్లు అయితే... కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ప్రపంచంలోనే అత్యంత వృద్దురాలిగా రెహ్తీ బేగమ్ నిలుస్తుంది. అంతేకాదు,ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం బతికిన మనిషిగా కూడా రికార్డుల్లోకి ఎక్కుతుంది.

రెహ్తీ బేగమ్ వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని జమ్మూకశ్మీర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్(DIPR) శాఖ తమ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 'వ్యాక్సిన్ డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో భాగంగా 124 ఏళ్ల వృద్దురాలు రెహ్తీ బేగమ్ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు.' అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

 124-Year-Old Woman Administered Covid Jab In Jammu Kashmir

రెహ్తీ బేగమ్ కుటుంబ సభ్యులు ఆమె వయసుకు సంబంధించిన ప్రూఫ్స్ ఏవీ సమర్పించలేకపోయారు. వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న డా.గాని మాట్లాడుతూ... డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో భాగంగా తాము ఆ వృద్దురాలి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు రెహ్తీ బేగమ్ సుముఖత వ్యక్తం చేసిందన్నారు. వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు ఆమె వయసు గురించి ఆరా తీయగా 100 ఏళ్లు దాటిపోయాయని చెప్పిందన్నారు.

రెహ్తీ బేగమ్ కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డుపై ఆమె పుట్టిన తేదీని పరిశీలించగా... దాని ప్రకారం ఆమెకు 124 ఏళ్లుగా తెలిసిందన్నారు. కచ్చితంగా ఆమె వయసు 100 పైనే ఉంటుందని... అయితే అసలు వయసు ఎంతనేది తాను కచ్చితంగా చెప్పలేనని డా.గాని పేర్కొన్నారు. దీనిపై స్పందించేందుకు బారాముల్లా డిప్యూటీ కమిషనర్ భూపిందర్ కుమార్ అందుబాటులో లేకుండా పోయారు. అధికారిక లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఇప్పటివరకూ 9వేల మంది వ్యాక్సిన్ ఇచ్చారు.

కాగా,గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం... ప్రస్తుతం ఈ భూమి మీద బతికి ఉన్న అత్యంత వృద్దురాలు జపాన్‌కు చెందిన కేన్ తనకా. ప్రస్తుతం ఆమె వయసు 118 ఏళ్లు. ఇప్పటివరకూ ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు బతికిన రికార్డు ఫ్రాన్స్‌కి చెందిన జీన్ లూయిస్ కాల్మెంట్ పేరిట ఉంది. 1875,ఏప్రిల్ 21న జన్మించిన ఆమె 122 ఏళ్ల 164 రోజుల పాటు బతికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+