గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది మృతి, కూలిపనుల కోసం వెళ్లి పైలోకాలకు !

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ లోని ఖోడా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. గుజరాత్ లోని అహమ్మదాబాద్-ఇండోర్ జాతీయ రహదారిలో మంగళవారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది.

మధ్యప్రదేశ్ లోని సేజేబాడ గ్రామంలో నివాసం ఉంటున్నవారు కూలి పనులు చెయ్యడానికి గుజరాత్ వెళ్లారు. మంగళవారం వేకువ జామున అందరూ తుపాన్ వాహనం (జీపు)లో బయలుదేరారు. మార్గం మధ్యలో కేదల్ జిల్లాలోని కతలాల్ ప్రాంతంలో తుపాన్ జీపు అదుపుతప్పింది.

 13 dead as jeep rams into truck in Kheda in Gujarat

వేగంగా వెళ్లిన తుపాన్ జీపు ముందు వెలుతున్న ట్రక్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ తో సహ 13 మంది దుర్మరణం చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలైన 9 మందిని ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా జీపు నడపడం వలనే ప్రమాదం జరిగిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 13 people were killed and eight others injured when their jeep rammed into a stationary truck on the Ahmedabad-Indore Highway in Kheda district in the early hours on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి