పొలంలో 13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు రేప్
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణాలు ఆగడం లేదు. తాజాగా మరో మైనర్ బాలిక పైన అత్యాచారం వెలుగు చూసింది. ఫైజ్‌గంజ్ ప్రాంతంలో పొలంలో ఉన్న పదమూడేళ్ల బాలిక పైన పదిహేనేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాలిక పొలం వద్ద ఉండగా ఆమెపై బాలుడు అఘాయిత్యం చేశాడని చెప్పారు. ఘటన అనంతరం అతను పారిపోయినట్లు తెలిపారు. ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది.

వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) మున్నాలాల్ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications