బిల్కిస్ బానో దోషుల రిలీజ్: ముమ్మాటికీ తప్పే, సీజేఐకు 134 మంది బ్యూరోక్రాట్ల లేఖ
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు 11 మంది నిందితుల విడుదలపై దుమారం కొనసాగుతోంది. అయితే దీనిపై బ్యూరోక్రాట్లు కూడా స్పందించారు. 134 మంది బ్యూరోక్రాట్లు సుప్రీంకోర్టు సీజేఐకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కొత్త సీజేఐ జస్టిస్ యుయు లలిత్‌ను బ్యూరొక్రాట్లు కోరారు.
సీజేఐకు లేఖ రాసిన వారిలో మాజీ ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ కేంద్ర కార్యదర్శి కేఎం చంద్రశేఖర్, మాజీ విదేశాంగ సెక్రటరీలు శివశంకర్ మినన్, సుజతా సింగ్, మాజీ హోంశాఖ సెక్రటరీ జీ పిల్లై తదితరులు ఉన్నారు. దోషులను విడుదల చేయాలనే గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని బ్యూరొక్రాట్లు తప్పుపట్టారు. గుజరాత్ ఘటన దిగ్బ్రాంతికరం అన్నారు.

బిల్కిస్ బానోపై 2002లో సామూహిక అత్యాచారం , హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న నిందితులు 11 మందిని విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఆరోపణలపై పదకొండు మంది నిందితులకు జనవరి 21, 2008న మంబయిలోని స్పెషల్ సీబీఐ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ దోషులు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
పంచమహల్ కలెక్టర్ సుజల్ మయత్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కొన్నినెలల క్రితం మిగతా వారందరినీ రిలీజ్ చేయాలని కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా... ఈ 11మంది దోషులందరికీ క్షమాభిక్ష పథకం కింది రిలీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ని తగలబెట్టిన ఘటనలో 59 మంది 'కరసేవకులు' మృతి చెందారు. తరువాత జరిగిన హింసలో.. ఐదు నెలల గర్భిణి బిల్కిస్ బానో పారిపోయింది. పొలంలో దాక్కుని ఉండగా, కొడవళ్లు, కత్తులు, కర్రలతో సాయుధులైన గుంపు వారిపై దాడి చేసింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. దాడిలో ఆమె కుటుంబంలోని ఏడుగురు చనిపోగా.. ఆరుగురు సభ్యులు పారిపోయారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications