లోయలో పడిన మినీ బస్సు: 14మంది మృతి
శ్రీనగర్: జమ్మూలో మంగళవారం ఉదయం ఓ మినీ బస్సు(జెకె14సి-8068) లోయలో పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతిచెందగా, మరో 17మందికి గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉధంపూర్ జిల్లాలోని ఘోర్డి గ్రామం నుంచి రామనగర్‌కి వెళ్తున్న బస్సు దల్సర్ వద్ద అదుపు తప్పి లోయలో పడింది.

ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని జిఎంసి జమ్మూకు తరలించారు.
కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications