లోయలో పడిన బస్సు: 14 మంది మృతి
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడటంతో 14 మంది మృతిచెందారు. మరో 40మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి 55 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మండి జిల్లా వద్దకు చేరుకోగానే అదుపుతప్పి లోయలో పడింది.

ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications