ఎన్‌కౌంటర్: వరంగల్ స్తీ సహా 14 మంది మావోల హతం

మావోయిస్టులకు, భద్రతా బలగాల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్ సందర్భంగా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మల్కాన్‌గిరి జిల్లా సిల్లాకోట వద్ద అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారు జామను ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. మావోయిస్లు కాల్పులు జరపడంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
మల్కాన్‌గిరి పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) అఖిలేశ్వర్ సింగ్ నాయకత్వంలో మావోయిస్టుల కోసం గాలింపు జరుగుతోంది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు ఉన్నట్లు సమాచారం వరంగల్ జిల్లా పోచంపేటకు చెందిన ప్రమీల అలియాస్ మీనా అనే మహిళా నక్సలైట్ మృతుల్లో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications