బాలికను వ్యాన్‌లో ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: ఓ మైనర్ బాలిక(14)పై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారం జరిపారు. ఈ దారుణ ఘటన గడిచిన గురువారం చోటుచేసుకుంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి.. రోజులాగే బాలిక ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తోంది. ఆ సమయంలో టాటా సుమో వాహనం వచ్చి ఆగింది. వాహనంలో ఉంది తనకు తెలిసినవాడే కావడంతో ఆమె వ్యాన్‌లోకి ఎక్కింది.
అయితే, లోపల అప్పటికే మరో ఐదుగురు ఉన్నారు. ఆమెను వ్యాన్‌లో దక్షిణ ఢిల్లీలోని దిచిఆన్ గ్రామశివారులోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. కారును రోడ్డు ప్రక్కగా ఆపి లోపలికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
జరిగిన విషయంపై పోలీసులకు చెబితే నిన్ను, నీ తమ్ముడిని చంపేస్తామని బెదిరించారు. పెనుగులాటలో బాలికను కొట్టి గాయపరిచారు. కారును బాలిక అరుపులను గమనించిన ఓ బాటసారి పోలీసులకు సమాచారం అందించాడు. వెనువెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పారిపోవడానికి సిద్ధంగా ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను రాహుల్(19), సూరజ్(19), సందీప్(21), రమేశ్(27), నరేందర్(20), అమన్(23)గా గుర్తించారు. వీరిలో రాహుల్ అనే యువకుడు బాలిక పొరుగు ఇంటి వ్యక్తిగా సమాచారం. నిందితులపై పోలీసులు ఐపీసీ సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
డ్రైవర్‌గా పనిచేస్తున్న బాలిక తండ్రి(34) తన ఆవేదనను వ్యక్తపరుస్తూ.. కూతురిని ఒంటరిగా పాఠశాలకు పంపించడమనే తన చర్య మిగిలిన తన జీవితం మొత్తాన్ని పాశ్చత్తాపపడేలా చేసిందని అన్నాడు. ఈ ఘటనతో కలలు కల్లలయ్యాయని అన్నాడు.












Click it and Unblock the Notifications